

శంఖవరం మన న్యూస్ (అపురూప్):ఆంధ్రాలో 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ సారి చాలా మంది విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించారు.చదువుకునే రోజుల్లో 10వ తరగతి చాలా ముఖ్యమైనది. అందుకే విద్యార్థులు విద్యాసంవత్సరం మెుదటి నుంచే సన్నద్ధం అవుతుంచారు. అటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ విద్యార్థులకి మంచి విద్యను అందించే ప్రయత్నం చేస్తారు.వివరాల్లోకి వెళితే…కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన కొంకిపూడి అప్పారావు ద్వితీయ కుమార్తె కొంకిపూడి నిఖిల శ్రీ పండూరు గురుకులం లో పదవ తరగతి చదువుతూ, స్వయ గ్రామమైన శంకవరం అంబేద్కర్ నగర్ కాలనీలో పదవ తరగతి విద్యార్థి విద్యార్థినీల ఫలితాలలో కొంకిపూడి నిఖిల శ్రీ 560/600 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని ప్రతిభను కనబరిచింది. ఈ సందర్భంగా నిఖిల శ్రీ తల్లిదండ్రులు అంబేడ్కర్ నగర్ కాలనీలో గల పెద్దలు, ప్రజలు పలువురు ఆమెను అభినందించారు. అంతేగాక శంఖవరం అంబేద్కర్ కాలనీలో విద్యార్థినీలు విద్యపై ఆసక్తి చూపుతున్నారని ఇటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో కూడా విద్యార్థిని ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుందని చక్కటి విద్యను అభ్యసిస్తున్న చదువుల తల్లులు కాలనీలో జన్మించడం ఆనందదాయకమని పలువురు కొనియాడారు.