

మన న్యూస్,నిజాంసాగర్,పిట్లం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..అన్ని మతాలు చెప్పేదిఒక్కటేనని,మనషులంతా సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు.నెలవంక చూసినప్పటి నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపట్టి,అల్లా కృపకు పాత్రులవుతారన్నారు.
రాబోయే రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు..
ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,పిట్లం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి,మండల అధ్యక్షులు మల్లికార్జున్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్ నాయకులు అనిస్, తదితరులు ఉన్నారు.




