

కర్మన్ ఘాట్. మన న్యూస్:- చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవస్థానం హుండీలను గురువారం ఆలయ కార్యనిర్వాహణాధికారి లావణ్య ఆధ్వర్యంలో, దేవాదాయ శాఖ రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ శేఖర్ పర్యవేక్షణలో లెక్కించారు. స్వాములోరికి రూ.40,83,498 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.వీటితో పాటు 83 యూఎస్ డాలర్లు,10 గ్రేట్ బ్రిటన్ పౌండ్స్, 10 అరబ్ ధరంస్,5 కెనడ డాలర్లు, 21 సింగపూర్ డాలర్లు, 70 నేపాల్ రూపాయలు, 10 యూరోలు, గతంలొ వచ్చిన సగటు ఆదాయముతో పోలిస్తే , ప్రస్తుతము వచ్చిన హుండీ అదాయము భారీగా వచ్చినట్లు తెలియజేశారు. లెక్కింపు కార్యక్రమములో, సిబ్బంది యం. వెంకటయ్య, జి. రమాదేవి, టి. వేణు గోపాల్, స్వాతి, మాజీ ధర్మకర్తలు బబ్బూరి ఆనంద్ గౌడ్ ,శివ కేశవ స్వచ్చంద సేవా సమితి వాలంటీర్లు, భక్తులు తది తరులు పాల్గొన్నారు.
