

మన న్యూస్,తిరుపతి,మార్చి 16 :– శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక కరకంబాడి రోడ్డు మార్గంలోని వినాయక సాగర్ వద్ద జరిగిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. డిబిఆర్ హాస్పిటల్ వైద్య బృందం నేతృత్వంలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరంలో 150 మంది పైగా వాకర్సు వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాకర్స్ అసోసియేషన్ జాతీయ నాయకులు కోనేటి రవి రాజు హాజరై పలు సూచనలు చేశారు. సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తు కార్యాచరణలో తమ వంతు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందజేస్తామన్నారు. అనంతరం ముఖ్యఅతిథి కోనేటి రవి రాజుని అధ్యక్షులు సాంబశివారెడ్డి, కోశాధికారి కృష్ణమూర్తి,ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు, సహాయ కార్యదర్శి సాయి కృష్ణమరాజు, లీగల్ అడ్వైజర్లు దేవర మనోహర, మంజుల,తదితరులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకటేశ్వర్లు కోఆర్డినేటర్ చంద్రమోహన్ సభ్యులు చంద్రశేఖర రావు, వెంకటేశ్వర్లు,నిరంజన్ నాయుడు, శివానందరెడ్డి, ప్రకాష్, రామమూర్తి, రాజు, నరసింహులు, అధిక సంఖ్యలో శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
