

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మార్చి 15:- జోగులాంబ గద్వాల జిల్లాఅలంపూర్ ఉండవెల్లి : ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా సమీపంలో మానోపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ రవి రెడ్డి శనివారం రాత్రి 8.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. అలంపూర్ చౌరస్తా నుండి చెన్నిపాడు గ్రామం వైపుకు బైక్ పై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలంకు పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలంపూర్ మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
