Mana News :- చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండల పరిధిలోని ఊట్లవారిపల్లిలో వెలసిన
శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సమీపంలో జరుగుతున్న రహదారి, పలు అభివృద్ధి పనులను శనివారం చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు .., చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పరిశీలించారు.సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు,
ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి కుటమి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రాంగణానికి చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆలయ అధికారులు, అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో సాదర స్వాగతం పలికారు.అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి,పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు , ఎమ్మెల్యే పులివర్తి నాని. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ రోడ్డును సుమారు 50 అడుగుల వెడల్పుతో 0.5కిలోమీటర్లు రోడ్డును 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు , ఎమ్మెల్యే పులివర్తి నాని.ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *