అమరావతి కేంద్రంగా బిగ్ డెసిషన్ – గేమ్ ఛేంజర్..!!

Mana News :- ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్త రాజధాని అమరావతి విషయంలో వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఆర్దిక వనరుల సమీకరణ పైన ఫోకస్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు నిర్మాణాల పైన కసరత్తు చేస్తోంది. పలు నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేసింది. ఇక, కీలకమైన ఐకానిక్ టవర్స్ టెండర్లు పిలిచేందుకు సిద్దమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతికి ప్రధాని :- అమరావతి పనుల రీ లాంఛ్ కోసం ప్రధాని మోదీని ఆహ్వానించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇదే అంశం పైన ఢిల్లీ పర్యటనలో చర్చించారు. ఈ నెలాఖరులో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. ప్రధానితో భేటీ అయి అమరావతికి ఆహ్వానించనున్నారు. అమరావతి పనుల ప్రారంభ ఘట్టం అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నవనగరాల నిర్మా ణం లో భాగంగా ప్రధాని తో ఆ సిటీలకు శంకుస్థాపన చేయించనుంది. ఏప్రిల్ మూడో వారంలో ప్రధాని అమరావతికి వచ్చే అవకాశం ఉందని. ఇక, టెండర్లు పూర్తయిన వాటి నిర్మాణాలకు షెడ్యూల్ ఖరారు చేస్తోంది. ఐకానిక్ భవనాల కోసం:- అమరావతి పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా మిగిలి ఉన్న ముఖ్యమైన పనులకు టెండర్లు పిలిచే పనిలో సీఆర్​డీఏ అధికారు లు కసరత్తు చేస్తున్నారు. అమరావతి ప్రభుత్వ సముదాయంలోనే అత్యంత కీలకమైన ఐకానిక్‌ టవర్లకు వచ్చే వారం టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. ఐదు టవర్ల నిర్మాణానికి ప్రస్తుత ధరల మేరకు రూ. 4,687 కోట్ల వ్యయానికి ప్రభుత్వం పాలనాపరంగా ఆమోదించింది. గతంలోలాగే ఈసారి కూడా మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలవనున్నారు. జేఏడీ టవర్‌ బేస్‌మెంట్‌, గ్రౌండ్ ఫ్లోర్‌ కాకుండా 47 అంతస్తులు కాగా, మిగిలిన 4 హెచ్‌ఓడీ టవర్లు 39 అంతస్తులుగా డిజైన్‌ చేశారు. ఈ టవర్ల నిర్మాణానికి 60 వేల టన్నుల స్టీల్‌ అవసరమవుతుంది. 2028 లక్ష్యంగా :- ఇందు కోసం సీఆర్డీఏ అధికారులు ఇప్పటికే రాయగడ ఉక్కు పరిశ్రమతో పాటు బళ్లారిలోని జిందాల్‌ కర్మాగారం, తిరుచిరాపల్లిలోని ఎవర్‌సెందై వర్క్‌షాపులను పరిశీలించారు. రాయగడలో ఉక్కు కొని బళ్లారి, తిరుచిరాపల్లిలో ఫ్యాబ్రికేట్‌ చేయనున్నారు. త్వరలోనే మద్రాస్‌ ఐఐటీ నిపుణు వచ్చి పునాదుల పటిష్టతను పరిశీలించనున్నారు. రాజధానిలో సువిశాలమైన రహదారులు నిర్మానం చేసి చైన్నై-కోల్‌కతా హైవేతో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు రాజధానిలోని అన్ని ప్రధాన రోడ్లను అనుసంధానించేలా డీపీఆర్‌ రూపొందిస్తున్నారు. అమరావతిలో మొత్తంగా రూ 64,721 కోట్ల ఖర్చుతో ప్రారంభిస్తున్న నిర్మాణ పనులను 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 3 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!