ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఏడాది ఉత్తమ లెజిస్లేటర్‌ అవార్డు

Mana News :- పార్లమెంట్‌లో ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు ఇచ్చినట్టుగానే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఏడాది ఉత్తమ లెజిస్లేటర్‌ అవార్డు కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ 2025-26 సమావేశాల నుంచి వచ్చే ఏడాది బడ్జెట్‌ సమావేశాల వరకు సభలో సభ్యుల పనితీరును పరిగణనలోకి తీసుకుని.. ఉత్తమ లెజిస్లేటర్‌ అవార్డుకు ఎంపిక చేయబోతున్నారు.. సభ్యుల పనితీరు, వారు అడుగుతున్న ప్రశ్నల తీరు.. సభలో వారి ప్రవర్తన ఆధారంగా ఈ అవార్డుకు సభ్యులను ఎంపిక చేయనున్నారు.. దీనిపై త్వరలోనే ఓ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు..ఇటీవల స్పీకర్‌ చింతకాలయ అయ్యన్నపాత్రుడితో సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాడు.. ఉత్తమ లేజిస్లేటర్‌ అవార్డుపై చర్చించారు.. గతంలో శాసనసభ్యులుగా అసెంబ్లీలోకి ప్రవేశించినప్పుడు అప్పట్టి పరిస్థితులు ఎలా ఉండేవి? సభా సంప్రదాయాలకు ఎలా విలువనిచ్చేవారు? చర్చలు ఎలా జరిగేవి వంటివి గుర్తు చేసుకున్నారు.. అయితే, ఇప్పుడు కూడా సభలో చర్చల్లో ఇంకా నాణ్యత, సభ్యుల భాగస్వామ్యం పెరగాలని అభిప్రాయపడ్డారు.. అలా సభ ప్రజావాణిని వినిపించేందుకు వేదికగా నిలబడాలని స్పీకర్‌, సీఎం అభిప్రాయాలన్ని వ్యక్తం చేశారు.. అందులో భాగంగానే ఉత్తమ లెజిస్లేటర్‌ అవార్డు ఇస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట.. ఉత్తమ లెజిస్లేటర్‌ ఎంపిక కోసం అసెంబ్లీలోనూ ఒక కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కూడా రాగా.. ఇప్పుడు కమిటీ ఎంపిక కోసం ముందడుగు వేస్తోంది ప్రభుత్వం..

Related Posts

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..