

Mana News, శ్రీకాళహస్తి ,మార్చి 15:– శ్రీకాళహస్తి నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గా శ్రీకాళహస్తి పట్టణం లోని 18వ వార్డు కి చెందిన పఠాన్ ఫరీద్ ను ఎంపిక చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం తెలిపింది. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వైయస్సార్ యువసేన లో పనిచేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. ఇతను పార్టీకి అందించిన సేవలను గుర్తుపెట్టుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షుడు గా పఠాన్ ఫరీద్ ని ఎంపిక చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయానికి సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో పఠాన్ ఫరీద్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు ప్రకటన వెలువబడింది. ఈ సందర్భంగా పఠాన్ ఫరీద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా తమ ఎంపికకు కారకులైన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు భూమన్ కరుణాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దెల గురుమూర్తి లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పఠాన్ పరీద్ ను అభినందించారు.
