నాగబాబు ఆస్తులెంత – అన్నయ్య, పవన్ కు అప్పు లెక్కలిలా..!!

Mana News :- మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. కూమటి నుంచి అయిదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. రేపు (సోమవారం) నామినేషన్లకు చివరి రోజు.జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేయటంతో..మిగిలిన నలుగురు టీడీపీ నుంచి నామినేషన్లు వేయనున్నారు. వారి పేర్లను ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా, నాగబాబు తన ఎన్నికల అఫిడవిట్ తో తన ఆస్తులతో పాటుగా అప్పుల లెక్కలను వెల్లడించారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడుకు పవన్ కు చెల్లించాల్సిన అప్పుల గురించి వివరించారు. నాగబాబు ఆస్తులు :-జనసేన నుంచి నాగబాబు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. ఎన్నికల అఫిడవిట్‌లో నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపర్చారు. నాగబాబు తన ఆస్తుల విలువ70 కోట్లుగా వెల్లడించారు. నాగబాబుపైన ఎలాంటి కేసులు లేవు. కాగా, తనకు ఉన్న అప్పుల లెక్కలను వెల్లడిస్తూ అన్నయ్య చిరంజీవి.. తమ్ముడు పవన్ దగ్గర తీసుకున్న అప్పుల గురించి వివరించారు. నాగబాబు చరాస్తుల విలువ 59 కోట్లుగా పేర్కొన్నారు. బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నగదు కలిపి 59 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ .. బాండ్ల రూపంలో రూ.55.37 కోట్లు ఉండగా, చేతిలో నగదు – రూ.21.81 లక్షలు ఉంది.ఇవీ లెక్కలు :- ఇక, బ్యాంకులో తన ఖాతాల్లో రూ 23.53 లక్షలు ఉన్నట్లు నాగబాబు వెల్లడించారు. ఇతరుల నుంచి తాను రూ 1.03 కోట్లు అప్పులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. తనకు ఉన్న బెంజ్ కారు విలు వ రూ 67.28 లక్షలుగా వెల్లడించారు. హ్యుండాయ్ కారు – రూ.11.04 లక్షలు, కాగా ఇక.. బంగారం -వెండి విలువ రూ.57.99గా వివరించారు.724 గ్రాముల బంగారం, తన సతీమణి వద్ద 55 క్యారట్ల వజ్రాలు (రూ.16.50 లక్షలు), 20 కేజీల వెండి (రూ.21.40 లక్షలు) ఉన్నాయి. అదే విధంగా.. హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. చిరంజీవి- పవన్ నుంచి అప్పు :- హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భూములు ఉన్నట్లు అఫిడవిట్ లో పొందుపర్చారు. రంగా రెడ్డి జిల్లాలో 2.39 ఎకరాల భూమి విలువ రూ.5.3 కోట్లు, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 8.28 ఎకరా ల భూమి రూ.82.80 లక్షలు, రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో 1.07 ఎకరాల భూమి ఉండగా.. దాని విలువ రూ.53.50 లక్షలుగా పేర్కొన్నారు. హైదరాబాద్ మణికొండలో విల్లా – రూ.2.88 కోట్లు గా వివరించారు. కాగా.. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.11.20 కోట్లు. ఇక.. తన సోదరులు చిరంజీవి దగ్గర రూ.28.48 లక్షలు అప్పు తీసుకోగా.. పవన్ కల్యాణ్ దగ్గర రూ.6.90 లక్షలు అప్పు తీసుకు న్నట్లు నాగబాబు వెల్లడించారు. ఇక, బ్యాంకుల్లో ఇంటి రుణం కింద రూ 56.97 లక్షలు, కారు కోసం తీసుకున్న రుణం రూ 7.54 లక్షలు ఉన్నట్లు వివరించారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///