Mana News ;- తిరుపతి అలిపిరి పోలీస స్టేషన్ పరిధిలోని ఎర్రమిట్టకు చెందిన ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఘటనపై హిజ్రాలపై గురువారం కేసు నమోదైంది. శివరాత్రి రోజున గుడికి వెళ్లిన ఓ వ్యక్తి హిజ్రాలకు రూ. 50 ఫోన్ పే చేశాడు. వారు రూ. 20వేలు కావాలంటూ నిందితుడిని వేధించారు. దీంతో ఆయన ఫోన్ ఆఫ్ చేయగా హిజ్రాలు అతడి ఇంటికి వెళ్లి కిడ్నిప్ ప్రయత్నం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.








