105 మ్యాచ్‌లు.. 344 వికెట్లు! కట్ చేస్తే షాకింగ్ రిటైర్మెంట్‌

Mana News :- విదర్భ స్టార్ ఆఫ్ స్పిన్నర్ అక్షయ్‌ వాఖరే కీలక నిర్ణయం తీసుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌ ఫైనల్ విజయనంతరం వాఖరే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.నాగ్‌పూర్ వేదికగా కేరళతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్బ విజయం సాధించింది. ఫైనల్‌ డ్రాగా ముగిసినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా విదర్భ ఛాంపియన్‌గా అవతరించింది.అయితే ఈ మ్యాచ్‌లో వాఖరేకు ఆడే అవకాశం లభించలేదు. అతడు చివరగా తమిళనాడుతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విదర్బకు ప్రాతినిథ్యం వహిచాడు. ‘రంజీ చాంపియన్‌ జట్టులో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. విజేతగా వీడ్కోలు పలకడం కంటే ఇంకేం కావాలి. 100 మ్యాచ్‌ల అనంతరం తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ జట్టు అవసరాల దృష్ట్యా సీజన్‌ ముగిసేవరకు కొనసాగాను’ అని 39 ఏళ్ల వాఖరే వెల్లడించాడు.2006-07 రంజీ సీజన్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అక్షయ్‌.. విదర్బ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. తన సంచలన ప్రదర్శనతో విదర్భకు ఎన్నో చారిత్రత్మక విజయాలను అందించాడు. మూడోసారి విదర్భ విజేతగా నిలవడంతో వాఖరే తనవంతు పాత్ర పోషించాడు. దేశవాళీల్లో 105 మ్యాచ్‌లాడిన ఈ కుడిచేతి వాటం స్పిన్నర్‌ 344 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అతడి ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 3 పది వికెట్‌ హాల్స్‌, 21 ఫైవ్‌ వికెట్ల హాల్స్ ఉన్నాయి. విదర్భకు భారీ నజరానా..:- మూడోసారి రంజీ టైటిల్‌ నెగ్గిన తమ జట్టుకు విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ (వీసీఏ) భారీ నజరానా ప్రకటించింది. టీమ్‌ మొత్తానికి రూ. 3 కోట్లు నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని తెలిపింది. ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి రికార్డు నెలకొలి్పన హర్ష్ దూబేకు రూ. 25 లక్షలు… నాలుగు సెంచరీలతో అదరగొట్టిన కరుణ్‌ నాయర్‌కు రూ. 10 లక్షలు… ఈ రంజీ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన యశ్‌ రాథోడ్‌కు రూ. 10 లక్షలు… హెడ్‌ కోచ్‌ ఉస్మాన్‌ ఘనీకి రూ. 15 లక్షలు… అసిస్టెంట్‌ కోచ్‌ అతుల్‌ రనాడేకు రూ. 5 లక్షలు… ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ నితిన్‌ ఖురానాకు రూ. 5 లక్షలు… స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ యువరాజ్‌ సింగ్‌ దసోంధికి రూ. 5 లక్షలు… వీడియో ఎనలిస్ట్‌ అమిత్‌ మాణిక్‌రావుకు రూ. 5 లక్షలు ప్రకటించారు.

Related Posts

రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, 15 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మణికొండ మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్ మన న్యూస్ ;- తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిజెఆర్ జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, అండర్ 15 టోర్నమెంట్ లో మణికొండ మ్యాచ్ పాయింట్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తమ సత్తా…

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 5 views
రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

  • By RAHEEM
  • October 29, 2025
  • 5 views
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..