మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- ఎంపీడీవోకు తపస్ వినతిస్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగామూడవ విడతలో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తపస్ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, నరసింహ సోమవారం ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికలు ముగిసిన తర్వాత సిబ్బంది స్వంత గ్రామాలకు వెళ్లే విధంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కోరారు.పసి పిల్లలు ఉన్న తల్లులకు, అనారోగ్యంతో ఉన్న వారికి,అత్యవసరమున్న ఉపాధ్యాయులకు ఎన్నికల సంఘం నిర్దేశించిన రెమ్యూనరేషన్ అందించాలని కోరారు. మూడు విడతలు ఎన్నికలు కేటాయించబడ్డ మహిళా ఉపాధ్యాయులను మినాయించాలని తెలిపారు. మండల అధ్యక్షులు నర్సింలు అధ్యక్ష కార్యదర్శులు రవీందర్, రాకేష్, మోహన్ రావు సత్యనారాయణ రెడ్డి రవీందర్ రెడ్డి, సురేష్, తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *