చిత్తూరు, మన ధ్యాస నవంబర్-30: మాపాక్షి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా విశిష్ట సేవలు అందించి, సుదీర్ఘకాలం పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఆదర్శప్రాయంగా పని చేసిన సి. రవీంద్రనాథ్ రెడ్డి కి నేడు పదవీ విరమణ సందర్భంగా పి.ఆర్.టి.యు పక్షాన ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.యం. గిరిప్రసాద్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కె. కనకాచారి, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. విజయ భాస్కర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. నరేంద్ర రెడ్డి తదితరులు రవీంద్రనాథ్ రెడ్డి కి పూల బొకే మరియు శాలువా అందజేసి సత్కారం చేపట్టారు. నిరంతరం నిబద్ధత, క్రమశిక్షణ, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి చేయూతనిచ్చిన రవీంద్రనాథ్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తికి మార్గదర్శకంగా నిలిచిన ఆయన సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని వక్తలు అభినందించారు. సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సంఘ నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.







