మన ధ్యాస,నెల్లూరు, నవంబర్ 30: నెల్లూరు, లక్ష్మీపురం వాటర్ ట్యాంక్ దగ్గర త్రిష బ్యూటీ పార్లర్ ను ఆదివారం ఉదయం సినీనటి సంతోషి శ్రీకర్ ప్రారంభించినారు. ఈ సందర్భంగా సంతోషి శ్రీకర్ మాట్లాడుతూ….. లక్ష్మీ త్రిష రాజమండ్రి పచ్చి అక్కడే నెలరోజుల పాటు ఉండి ఈ బ్యూటీ కోర్స్ నేర్చుకుని, బ్యూటీ పార్లర్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు .పెళ్లి కావలసిన అన్ని సర్వీసెస్ ఒకే చోట లభించడం అభినందనీయం అని అన్నారు.బ్యూటీ పార్లర్ అభివృద్ధి చెందాలని కోరారు. బ్యూటీ పార్లర్ అధినేత లక్ష్మి త్రిష మాట్లాడుతూ….. మా బ్యూటీ పార్లర్ ప్రారంభానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. మావద్ద బ్రైడల్ మేకప్, ట్రీట్మెంట్, బ్యూటీ సర్వీసెస్, నెయిల్స్ ,ఎక్స్టెన్షన్, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఈవెంట్ సర్వీసెస్ కలవు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకురాలు కందికట్ల రాజేశ్వరి, షాపింగ్ మాల్ డైరెక్టర్ భయ్యా మల్లికా, ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు పిండి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.














