మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(గాజువాక)మే10 :

పెద్ద గంట్యాడ మండలం 76వ వార్డులో గల చిన్న కోరాడ (BC)గ్రామంలో ఎన్నికలు జరిగాయి.చిన్న కోరాడ స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఎన్నికల ఏర్పాట్లు జరిగాయి.గ్రామంలో సుమారుగా 450 ఓట్లు కలవు.ఉదయం 6 గ|| నుంచి 2గం ||వరకు గ్రామ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి అభ్యర్థి బాసెట్టి అప్పారావు ద్వితీయ అభ్యర్థి పూడి కొండబాబు ఎన్నికల బరిలోకి నిలవడం జరిగింది.గ్రామ ఎన్నికల ఉత్కంఠ కోరిలో భాగంగా మొత్తం పోలైన ఓట్లు 396 ఓట్లుగా నిర్ధారణ జరగక అందులో బాసెట్టి అప్పారావు 251 యొక్క ఓట్లు. పూరి కొండబాబు145 ఓట్లు రావడం జరిగింది.పూడి కొండబాబు మీద 106 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించిన బాసెట్టి అప్పారావుకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. గ్రామస్తులు మొదట నుంచి కూడా బాసెట్టి అప్పారావు మీద అపారమైన నమ్మకంతో ఆయనని గెలిపించడం జరిగింది. తదనంతరం గ్రామ పెద్దలకు సమక్షంలో యువత మహిళలు కలిసి ఆయనకు ఘన సన్మానం చేశారు.

చిన్న పోరాట గ్రామం పెద్ద వనుమ అప్పలరాజు మాట్లాడుతూ బాసెట్టి అప్పారావుని చిన్న కోరాడ గ్రామ ప్రజలు అపారమైన నమ్మకంతో అద్భుత ఘన విజయం అందించారు.గ్రామ అభివృద్ధికి ప్రజలలో ఉన్న నమ్మకానికి ఈయన గెలుపు ఒక ఉదాహరణ అని తెలిపారు.

గ్రామ పెద్ద అండి బోయిన అప్పలరాజు మాట్లాడుతూ గ్రామ సమస్యల పైన అటు ప్రజలకు ఆత్మీయుడుగా ఉంటూ ఆదరాభిమానాలు పొందిన గ్రామ ప్రెసిడెంట్ గా ఎన్నికైన బాసెట్టి అప్పారావుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు. ప్రజల ఆయన పైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని గ్రామ అభివృద్ధికి పాటుపడతారని మా నమ్మకం అని అన్నారు.

గ్రామ మహిళలు కడవల లావణ్య మాట్లాడుతూ బాసెట్ట అప్పారావు గెలవడానికి ప్రజలలో ఆయనకు ఉన్న ఆదరణ గ్రామ సమస్యలలో పరిష్కార దిశలో మెలకువలు వంటి ఆయన ఆలోచన తీరుకి అనుగుణంగా ప్రజలు మద్దతు పలకడం చాలా సంతోషదాయకమని తెలిపారు.

చిన్న కోరాడ గ్రామం ప్రెసిడెంట్ గా భాసెట్టి అప్పారావు మాట్లాడుతూ ఇంత ఘన విజయానికి గల కారణం గ్రామ పెద్దలు యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నాపైన నమ్మకంతో ఇంత ఘన విజయాన్ని అప్పగించడం చాలా సంతోషం. గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకుంటూ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలతో పాటు గ్రామ నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను.కూటమి ప్రభుత్వం నుంచి గ్రామానికి రావలసిన నిధులను రప్పించి అభివృద్ధి పథంలో నడిపించే విధంగా చర్యలు చేపడతానని తెలిపారు.ఈసారి గ్రామ దేవత పండుగ అత్యంత అద్భుతంగా నిర్వహించి.గ్రామ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండే విధంగా నా సేవ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కొంచెం మాంబా యువజన సేవా సంఘం సభ్యులు, యువత, మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.