పంచాయతీ గదుల ఆక్రమణపై కేసు పెట్టాలి !- టిడిపి నేత డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 14:– చిత్తూరు జిల్లా, పెనుమూరులో ఆరు పంచాయతీ గదులను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన కలెక్టర్ కు పంపిన లేఖలో ఒక వ్యక్తి ఆధ్వర్యంలో 18 ఏళ్లుగా గదులను ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. దీనివల్ల పంచాయతీకి రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని తెలిపారు. పెనుమూరు గ్రామ పంచాయతీ వారు 2007 లో ఎంపీ నిధులతో సంత గేటులో ఆరు గదులు నిర్మించారని తెలిపారు. అయితే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో కొందరు సదరు గదులను అక్రమంగా స్వాధీనంలో ఉంచుకుని పంచాయతీ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు. స్థానికుల ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు, జిల్లా పంచాయతీ అధికారి చొరవతో ఈ నెల 22 వ తేదీ బహిరంగ వేలం నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే అధికారులు ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గదులలో మూడు గదులను ఒక వ్యక్తి స్వాధీనంలో ఉంచుకుని అద్దెకు ఇచ్చారని చెప్పారు. అలాగే అతను మరో మూడు గదులను పంచాయతీ నుంచి నామ మాత్రపు ధరకు తీసుకుని అధిక ధరకు అద్దెకు ఇచ్చారు. దీని వల్ల పంచాయతీకి రూ. 50 లక్షలు పైగా నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఈ నేపధ్యంలో గదులను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, నష్ట పరిహారం వసూలు చేయాలని కోరారు. ఇన్నాళ్లు నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ గదుల వేలం పారదర్శకంగా నిర్వహించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు . గతంలో బస్టాండు కాంప్లెక్స్ లోని 22 గదుల వేలంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, కొందరు హై కోర్టులో స్టే తెచ్చారని గుర్తు చేశారు.దీనివల్ల పంచాయతీకి నెలకు మూడు లక్షలు నష్టం వస్తోందని పేర్కొన్నారు. ఆరు గదులను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టి నష్ట పరిహారం వసూలు చేయాలని కోరారు.

Related Posts

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!