మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతుల అభివృద్ధి ఎన్‌డిఎ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.ఆయన సింగరాయకొండలో జరిగిన కొండపి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ కమిటీలను బలోపేతం చేసి, రైతులకు ఎరువులు, విత్తనాలు, సాంకేతిక సహాయం అందుబాటులో ఉంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.జామాయిల్ చెట్ల బహిరంగ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మార్కెట్ కమిటీ ఖాతాలో జమ చేసి, ఆ నిధులతో మార్కెట్ యార్డ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.రైతులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని యాంత్రీకరణ ద్వారా అధిక దిగుబడులు సాధించాలని మంత్రి సూచించారు. అనంతరం ఆయన మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు మరియు ప్రజల నుండి వచ్చిన రెవెన్యూ, విద్యుత్ సమస్యలపై సమీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.







