మన ధ్యాస యాదమరి, సెప్టెంబర్ 3:
ఈరోజు సాయంత్రం 5 గంటలకు యాదమరి జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో ఎస్టీయూ యాదమరి మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్టీయూ సంఘానికి విశేష సేవలు అందించి, ఇటీవల పదవీ విరమణ చేసిన సంఘ నాయకులు గుణశేఖరన్, కోలా వాసులను మండల శాఖ ఘనంగా సత్కరించింది. వారి సేవలను కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కొనియాడారు. అలాగే, ఎస్టీయూ మండల శాఖ అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన ఎం. గుణశేఖరన్ స్థానంలో కె. సుబ్రహ్మణ్యం పిల్లై (ఎస్‌జిటి, ఆదర్శ ప్రాథమిక పాఠశాల, దలవాయిపల్లి)ని మండల అధ్యక్షుడిగా ఎన్నుకోగా, ఎస్‌ఎండీ సుల్తాన్ (ఎస్.ఏ. ఇంగ్లీష్, జడ్‌పిహెచ్‌ఎస్, కె. గొల్లపల్లి)ని మైనారిటీ కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ ఎన్నికలు ఎస్టీయూ చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు ఎన్.ఆర్. మదన్ మోహన్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి.
నూతనంగా ఎన్నికైన నాయకులు సంఘ బలోపేతానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఎస్టీయూ యాదమరి మండల గౌరవ అధ్యక్షులు ఎస్.ఎన్. భాషా, ప్రధాన కార్యదర్శి రమేష్, మహిళా కార్యదర్శి ప్రమీల కుమారి, జిల్లా కౌన్సిలర్లు గణపతి, రంగనాథం, ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు









