

మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేయడానికి వచ్చిన కలికివాయి గ్రామానికి చెందిన అంకమ్మ అనే వికలాంగురాలి పై ఎస్సై మహేంద్ర దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడడంతో మనస్థాపనతో ఎలుకల మందు తాగి మహిళా ఆత్మహత్య యత్నం చేసింది. గమనించిన బంధువులు అంకమ్మను హుటాహుటిన స్థానిక ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తమ ఇంటి ఎదురుగా ఉన్న ధర్మేంద్ర అనే వ్యక్తి తరచూ మద్యం తాగి ఒంటరిగా ఉన్న తనపై దాడి చేశాడని ఈ విషయాన్ని ఎస్ఐ మహేంద్ర కు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా దాడి చేసిన వారికి సపోర్ట్ చేస్తూ ఒక వికలాంగురాలినీ కూడా చూడకుండా దుర్భాషలాడి తమపై తప్పుడు కేసులు పెడతానంటూ బెదిరించి పంపించేసాడని, గత నెలలో కూడా ఇదే విధంగా అదే వ్యక్తి అర్ధరాత్రి తాగి తనపై దాడి చేయగా 100 కి కాల్ చేయగా పోలీసులు వచ్చి తప్పించారని.. అది తెలిసి కూడా ఎస్సై దాడి చేసిన వారికే సపోర్ట్ చేస్తూ తాముపై తప్పుడు కేసు బనాయించారని వికలాంగురాలైన తనకు సింగరాయకొండ పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగదు అంటూ మనస్థాపంతో ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు తెలిపిన బాధితురాలు అంకమ్మ తెలిపింది.
సింగరాయకొండ ఎస్సై వల్లే అంకమ్మకు ఈ గతి పట్టిందని వెంటనే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే దూకుడు ప్రవర్తనతో ఎస్ఐ మహేంద్ర గతంలో కొంతమందిపై విచక్షణారహితంగా దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి SI పై ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.