వెదురుకుప్పం, మన న్యూస్ : ఇటీవల అనారోగ్యానికి లోనై ప్రస్తుతం కోలుకుంటున్న బీజేపీ సీనియర్ నాయకులు బోడి రెడ్డి హనుమంత రెడ్డి ని ఆయన నివాసంలో ప్రత్యేకంగా పరామర్శించేందుకు తెలుగు యువత నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్, నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు బట్టే చాణుక్య ప్రతాప్, బూత్ కన్వీనర్ చిరంజీవి నాయుడు, సర్పంచ్ మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, యువ నాయకులు మనోహర్ నాయుడు, మురళి రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు హనుమంత రెడ్డిని కలిసారు.పరామర్శ సందర్భంగా వారు ఆయన ఆరోగ్య పరిస్థితి తేలుసుకుంటూ త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. బీజేపీలో ఆయన్ను ఓ మంచి మార్గదర్శిగా భావిస్తూ, ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. అనేక సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాల్లో హనుమంత రెడ్డి చూపిన నిబద్ధత, సమర్పణ ప్రజల్లో మంచి పేరును తీసుకొచ్చిందని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన గురుసాల కిషన్ చంద్ మాట్లాడుతూ, “పార్టీ పట్ల హనుమంత రెడ్డి కలిగిన అభిమానం, సుదీర్ఘమైన అనుభవం ఈ తరానికే , రాబోయే తరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుంది” అన్నారు.ఇక బట్టే చాణుక్య ప్రతాప్ మాట్లాడుతూ, “పార్టీని బలోపేతం చేయడంలో హనుమంత రెడ్డి పాత్ర అపూర్వమైనది. ఆయన మళ్లీ త్వరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం” అని తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమం ఆ ప్రాంతంలో రాజకీయ నాయకుల మధ్య సానుభూతి, మానవీయ విలువలకు అద్దం పడింది. పార్టీకి కష్టకాలంలో తోడుగా నిలబడే నేతలు, కార్యకర్తల మధ్య మైత్రీ సంబంధాలు ఎంత ముఖ్యమైనవో ఈ సందర్భం మరొకసారి గుర్తు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *