

మన న్యూస్ చిత్తూరు జులై-30 అక్రమ వడ్డీలు వసూలు చేస్తూ, అధిక వడ్డీలతో ప్రజలను, రైతులని, సామాన్య మధ్య తరగతి కుటుంబీకులను వేధిస్తున్నటువంటి వడ్డీ రాక్షసులను ఉక్కు పాదంతో అణిచివేయాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుకి విజ్ఞప్తి చేయడం జరిగింది.
5/- రూపాయల వడ్డీ, ₹10 వడ్డీలతో, రాకెట్ వడ్డీ ఎక్స్ప్రెస్ వడ్డీల, రోజువారి వడ్డీల పేరుతో సామాన్య మధ్యతరగతి కుటుంబం యొక్క రక్తం పిలుస్తూ కుటుంబాలను నాశనం చేస్తూన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. వడ్డీ రాక్షసులు గ్రామాల్లో విచ్చలవిడిగా ప్రజలను, రైతులు వేధిస్తున్నారని అన్నారు. చదువురాని రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములను, ఇండ్లని తనకా పెట్టించుకుని, వాళ్ళ దగ్గర నుండి వేలాది రూపాయల లక్షలాది రూపాయలు తీసుకొని వాళ్లని వేధిస్తూ, వారి భూమిని డబ్బులు చెల్లిస్తామన్న కూడా తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారు. రైతులను కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలు చేసుకునే విధంగా పురమాయిస్తున్నారు. ఇటువంటి వారిని అణిచివేయాలని, గుర్తింపులేని వడ్డీ వ్యాపారస్తుల భరతం పట్టాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
** *గుర్తింపు లేని ఆటో ఫైనాన్స్ రద్దు చేయండి*
అదేవిధంగా ఆటో ఫైనాన్స్ పేరుతో ఆటోలు, కార్లుకు ఫైనాన్స్ చేసి వాళ్ల దగ్గర నుండి అధిక వడ్డీలు వసూలు చేస్తూ… వారిని బెదిరించి వాహనాలు బలవంతంగా తీసుకొని, వెళుతూ… కుటుంబాలను ఛిద్రం చేస్తున్న గుర్తింపు లేని ఆటో ఫైనాన్స్ కంపెనీలు పైన కూడా ఉక్కు పాదం మోపాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆటో ఫైనాన్స్ కంపెనీల యొక్క రికవరీ టీమ్ లు యొక్క ఆగడాలు, దౌర్జన్యాలు మహిళల పట్ల అదుపు లేకుండా పోతుందని అన్నారు.
*పల్లెల పైన వల వేసిన మైక్రో ఫైనాన్స్, లోన్ యాప్ లను ఉక్కు పాదంతో తొక్కండి*
లోన్ యాప్ ల పేరుతో పల్లెల్లోకి వచ్చిన ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీలు, పల్లెల్లో ఉన్న నిరక్షరాశులను తక్కువ వడ్డీకే డబ్బులు ఇస్తామని మభ్యపెట్టి, వారి యొక్క ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంకు పాస్ బుక్ , ఇంటి పట్టాలు, తీసుకొని వాళ్లకి లోన్లు అంటగట్టి వాళ్ళ ఇంటి జాగాలని, భూములను కూడా స్వాధీనం చేసుకుంటూ పల్లెలపైన వలవేసిన ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీల పై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. స్పందించిన చిత్తూరు ఎస్పీ దీనిపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, గంజాయి, అక్రమ వడ్డీ వ్యాపారులు, లాటరీ మాఫియా, మైక్రో ఫైనాన్స్, లోన్ యాప్స్, ఆటో ఫైనాన్స్, పైన ఉక్కు పాదం మోపుతామని హామీ ఇచ్చారు
ఈ యొక్క కార్యక్రమంలో తెలుగు యువత కార్యదర్శి దొమ్మరపల్లి వినోద్ కుమార్, చారాల వినోద్ కుమార్, జైపాల్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.