విద్యార్థి దశ నుండి ఉన్నత ధ్యేయం తో చదువులు కొనసాగించాలి ఎస్సై బి మహేంద్ర పిలుపు.

సత్ప్రవర్తన విద్యార్థి ఎదుగుదలకు సోపానం

బాల బాలికలు కలిసి చదువుకోవడం కుటుంబ వాతా వరణాన్ని గుర్తు చేస్తుంది

మన న్యూస్ సింగరాయకొండ:-

విద్యార్థి దశ జీవితంలో ఎంతో ముఖ్య మైనదని అక్కడి నుండి సత్ప్రవర్తన, సంస్కారం తో పాటు ఎదుగుదలకు సోపానంగా లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు సాగాలని సింగరాయకొండ ఎస్సై బి మహేంద్ర పిలుపు ఇచ్చారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు చట్టాలు, నేరాలు పట్ల గీతం విద్యాసంస్థల లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి గీతం విద్యాసంస్థల నిర్వాహకుడు లక్ష్మణ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మహేంద్ర అవగాహన కల్పిస్తూ సమాజం లో అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకునే వాళ్ళ తో పాటు దుర్వినియోగం చేస్తూ జీవితాలను పాడు చేసుకుంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞానం మంచికి ఉపయోగ పడాలి కానీ సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగం, చెడు ప్రవర్తనకి దారి తీస్తుందని ప్రత్యేకంగా విద్యార్థులు చెడు మార్గానికి దారి తీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుండి విద్యార్థిని విద్యార్థులు సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని జీవితాలను ఉత్తమ మార్గం వైపు తీర్చి దిద్దుకోవాలి ఆయన కోరారు. సమాజంలో చోటు చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు, నేరాలు,మాదక ద్రవ్యాల రవాణా చెలామణి, వినియోగం గురించి అవగాహన చేసుకుంటూ మంచి మార్గం లో ముందుకు సాగాలని మహేంద్ర కోరారు. ఈ సందర్భంగా గీతం విద్యాసంస్థల నిర్వాహకుడు లక్ష్మణ రావు మాట్లాడుతూ విద్యార్థులు సంస్కారాన్ని అలవరుచుకుంటూ సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని జీవితాలను ఉత్తమ మార్గం వైపు తీర్చి దిద్దుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు హితవు చెప్పారు. విద్యాసంస్థ ప్రధానోపాధ్యాయుడు తాజుద్దీన్, సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు