

మన న్యూస్,నెల్లూరు, జూలై 15 : నెల్లూరు రాంజీ నగర్ ఆఫీసులో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం పాత్రికేయ సమావేశం నిర్వహించినారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ……..1) 100 కోట్ల రూపాయలతో కెనాల్ రివిట్మెంట్ 43 వేల ఎకరాలు,4 మండలాలు..,రూరల్, టీపీ గూడూరు, ఇందుకూరుపేట, ముత్తుకూరు.సిటీ బ్యూటిఫికేషన్ 100 కోట్ల రూపాయలతో జాఫర్ సాహెబ్ కెనాల్ కు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో రివిట్మెంట్ పనులు ప్రారంభం అయ్యాయి.దీనిక్రింద 43 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది.4 మండలాలు నెల్లూరు రూరల్ , ఇందుకూరుపేట, తటిపి గూడూరు, ముత్తుకూరు మండలాల రైతులకు పారుదల హక్కు ఉంది. అన్నింటికి మించి సిటీ నియోజకవర్గం లో పరిశుభ్రత డెవలప్మెంట్, బ్యూటిఫికేషన్ ఏర్పాటు లక్ష్యంగా పనులు ప్రారంభం.2) మరో 20 కోట్ల రూపాయలతో మైపాడు రోడ్డు – 4 మండలాలు -15000 వాహనాలు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లోనే మరో 20 కోట్ల రూపాయలతో 60 అడుగుల 4 లైన్ల విశాలమైన మైపాడు రోడ్డు ఏర్పాటు చేసుకున్నాం.తద్వారా 4 మండలాల కు రాకపోకలు సాగించే వాహనాలు, బస్సులు, లారీలు, ఆ రోడ్డు నుంచి వెళ్ళాలి. ఈ రోడ్డు ద్వారా సుమారు రోజుకు 15 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని అంచనా.3) మొత్తం 120 కోట్లతో కెనాల్, రోడ్డు, డివైడర్, బ్యూటిఫికేషన్.మొత్తం 120 కోట్లతో విశాలమైన రోడ్డు, కాలువ, డివైడర్ మీద బ్యూటిఫికేషన్ ని ఏర్పాటు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో జరిగింది.4) అభివృద్ధి కోసం – నాడు పేదలు తమ ఇల్లు, చిరు వ్యాపారాలను త్యాగం చేస్తే ఈ అభివృద్ధి సాధ్యం అయింది.నగరంలో వెనుకబడి ఉన్న ఆ ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ ఎంతోమంది పేదలు తమ ఇళ్ళు ఖాళీ చేసి మరెంతో మంది నిరుపేదల చిరు అంగళ్ళను త్యాగం చేస్తే,ఈ కాలువ రివిట్మెంట్ రోడ్డు, బ్యూటిఫికేషన్ లను ప్రారంభించుకున్నాము. ఎంతో మంది త్యాగాలతో సాధ్యమైన ఈ వందల కోట్ల అభివృద్ధి పనులు ఇప్పుడు అంతా నారాయణ గారి అనాలోచిత నిర్ణయాల వలన నేడు బూడిద లో పోసిన పన్నీరుగా మారింది అని అన్నారు.5) 80% పూర్తి అయ్యాయి – మిగిలి ఉన్న 20% పెండింగ్ పనులపై కనీస ఆలోచన కూడా చేయని టి డి పి ప్రభుత్వం. రోడ్డు, రివేట్మెంట్ బ్యూటిఫికేషన్ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి.ప్రాజెక్టులో భాగంగా రోడ్డు కు ఉత్తరం వైపు డ్రైనేజీ వాటర్ కోసం సైడ్ కాలువ నిర్మాణం జరగాలి అని అన్నారు.ఇలా ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి.వాటి గురించి కొంచం కూడా ఈ ప్రభుత్వం కానీ, నారాయణ కాని పట్టించు కోవడం లేదు అని అన్నారు. జీవో నంబర్ 1005 ద్వారా వాకింగ్ ట్రాక్ మీద 200 బంకులు పెట్టాలనే ఆలోచన అత్యంత దురదృష్టం అని అన్నారు.6) ట్రాఫిక్ సమస్య అధికం అయ్యే అవకాశం….200*100 వెహికల్స్ – రెండు వైపుల ట్రాఫిక్..- నో సర్వీస్ రోడ్డు, నో పార్కింగ్ ప్లేస్.. 4 మండలాలకు సమస్య. 200 షాపులు పెడితే రోజుకు సగటున ఒక్కో షాపుకు 100 మంది వచ్చినా మొత్తం 20 వేల మంది ఆ షాపుల దగ్గరకు వస్తారు.వారి వాహనాలను రోడ్డు మీద పార్కింగ్ చేస్తే.. రెండు పక్కల రోడ్డు మొత్తం బ్లాక్ అవుతుంది,పైగా అక్కడ విడిగా పార్కింగ్ ప్లేస్ లేదు, సర్వీస్ రోడ్డు కూడా లేదు అని అన్నారు.తద్వారా సిటీతో పాటు క్రింద ఉన్న 4 మండలాల ప్రజల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుంది అని అన్నారు.7) కాలువ పారుదల ఆగడం తో నీరు కలుషితం అయ్యి అనారోగ్యాలు, అంటువ్యాదులు విస్తరించే ప్రమాదం అని అన్నారు. 200 షాపులకు వచ్చే వారు అనగా అందులో అధికభాగం రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్,ఇలా షాప్స్ కు వచ్చేవారు చెత్త ని పక్కనే ఉన్న పారుదల కాలువలో వేస్తారు. తద్వారా పారుదల కాలువ లోని వాటర్ కలుషితం, అయ్యి నీరు పొల్యూట్ అవుతుంది అని అన్నారు.తద్వారా దోమలు అధికం అవుతాయి. ఆ ప్రాంతం మొత్తం అనారోగ్యం, అంటూ వ్యాదులు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది అని అన్నారు.8) కాలువ బ్లాక్ అయ్యి 4 మండలాల లోని 43 వేల ఎకరాలకు నీటి పారుదల ఆగిపోయే ప్రమాదం అని అన్నారు.200 షాపుల నుంచి వచ్చే చెత్త చేదారం తో 6 నెలల లోపు కాలువ బ్లాక్ అవుతుంది తద్వారా 4 మండలాలలోని 43 వేల ఎకరాల ఆయకట్టుకు.. నీరు అందకుండా ఉండే ప్రమాదం ఉంది అని అన్నారు.9) పంట కాలువల పోరంబోకు స్థలాల ఆక్రమణ చట్ట రీత్యా నేరం అవుతుంది అని అన్నారు.కాలువ లోని చెత్త మరియు పూడిక లను తీయడానికి పాత రోజుల నుంచి కాలువ గట్టుకు 20 నుంచి 30 అడుగులు కాలువ పోరంబోకుగా వదిలేవారు. వీటిని ఆక్రమించుకోవడం చట్ట రీత్యా నేరం అవుతుంది అని అన్నారు.10) పూడిక తీయడం ఇక సాధ్యం కాదు,ఇప్పుడు ఈ కాలువ గట్టు మీద వరుసగా 200 షాపులు ఏర్పాటు చేస్తే..కాలువ పూడిక ఎలా తీస్తారు. జేసీబీలు కాలువలోకి ఎలా వెళ్తాయి. దీంతో పూడికలు తీయడం కూడా సాధ్యపడదు అని అన్నారు.11) చుట్టు పక్కల ప్రాంతాల ఇల్లు వరద ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది అని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ కాలువ పూడి పోతే వర్షాలు, వరదలు వచ్చినప్పుడు చుట్టు పక్కల ఉండే ఇళ్ళు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉంది అని అన్నారు.12) వాకింగ్ ట్రాక్ కు ప్రమాదం…200 షాప్స్ వరుసగా పెట్టినప్పుడు – అక్కడకి వచ్చే జనాలు, షాపు మెటీరియల్ కలిపి షుమారు 300 టన్నులు భారం అక్కడ ఏర్పడుతుంది. ఇంత బరువు ఉండే ఉద్దేశం తో అక్కడ వాకింగ్ ట్రాక్ నిర్మాణం జరగలేదు. ఇప్పుడు సడన్ గా పెట్టె ఈ షాపుల కారణంగా ఆ బరువును ఆ ట్రాక్ భరాయించలేదు అని అన్నారు.13) 200 షాపులు ఒకే చోట అంటే బంకుల యజమానులకు గిట్టుబాటు కాదు,నగరానికి మారు మూల ఉండే ఈ ప్రాంతంలో 200 షాపులు ఆ ఒకే దగ్గర పెడితే ఆ షాపుల నిర్వహణ సాధ్యం కాదు … వాళ్లకు ఎలాంటి ప్రయోజనం కలుగదు.14) కెనాల్ ల్యాండ్స్ ను ఆక్రమించుకోవడం ద్వారా చట్టం లోని సెక్షన్ 23 ని అతిక్రమించడమే కాకుండా.. నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం మరో నేరం గా పరిగణించబడుతుంది అని అన్నారు.15) వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974ని అతిక్రమించడం ద్వారా పొల్యూషన్ మరియు ఎన్విరాన్మెంటల్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది చట్టరీత్యా నేరం..16) అన్నింటికన్నా మించి నేషనల్ గ్రీన్ ట్రిబునల్ ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకం గా వెళ్లడం అత్యంత నేరం…17) 1005 జీ ఓ కు మేము వ్యతిరేకం కాదు..8 కోట్లు ఖర్చు… ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన జిఓ ఆర్ టి నెంబర్ 1005 ద్వారా 200 మంది స్ట్రీట్ వెండర్స్ షాపులను ఏర్పాటు చేయడానికి మేము వ్యతిరేకం కాదు.. నెల్లూరు నగర కార్పొరేషన్ మొత్తం మీద అన్ని ప్రాంతాలలో.. ఒక్కొక్క ప్రాంతంలో 50 చొప్పున షాపులను పెట్టి 200 మందికే కాకుండా 5000 మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాము. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో చిరు వ్యాపారులకు ఇచ్చిన ప్రోత్సాహం ఎవ్వరు చేయలేరు 18) స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టాలి.స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అనేది.. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు.. పాదాచార్యులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు ఉదాహరణకు : ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, పెద్దపెద్ద తీమ్ పార్కులు, ఇలాంటి వాటి సమీప ప్రాంతాలలో ఏర్పాటు చేసినట్లయితే.. అది ఉపయోగకరంగాను..అలాగే ఏర్పాటు చేసుకున్న వారి వ్యాపార అభివృద్ధికి కూడా ఉపకరిస్తుంది . అంతేగాని ఒక్క క్షణం కూడా ట్రాఫిక్ నిలిపే అవకాశం లేని ఈ ట్రాఫిక్ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు నిర్వహించడం అనేది.. సరైన విధానం కాదు ఇది తప్పు..19 ) నగరంలో ఎనిమిది ప్రాంతాలలో చట్టలకు, నిబంధనలకు లోబడి ఒక్కో చోట 50 షాపులు చొప్పున ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉంటుంది,అంత చిన్న ప్రాంతంలో.. ఒకే చోట 200 షాపులు ఏర్పాటు చేస్తే.. నగరం నలుమూలల నుంచి అక్కడికి వచ్చి కొనుగోలు చేసేవారు ఉండరు. దీంతో 200 షాపులకు సంబంధించిన బిజినెస్ అక్కడ జరగదు. 20 ) మీరు ఈ విధ్వంసం పై ఆ ప్రాంతంలో శాంపిల్ సర్వే చేయించండి అని అన్నారు. ఒకవేళ మీరు షాపులు పెట్టాలని.. ఇది మీకు న్యాయం అనిపిస్తే. ఆ ప్రాంత ప్రజలతో ఒక శాంపిల్ సర్వే చేయించండి. అప్పుడు మీకే తెలుస్తుంది ఈ ప్రాజెక్టును నూటికి 95 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారని .. దీనివల్ల ఈ ప్రాంతం లో నష్టం జరగడమే కాకుండా ప్రజలకు ఇబ్బంది కలుపుతుందన్న అభిప్రాయంతో వారు ఉన్నారు.21) ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేయడానికి మీకు ఏమీ హక్కు ఉంది అని అన్నారు.సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ .. రోడ్ విస్తరణ పనులు. చేపట్టడంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎంతో శ్రమించింది. ఆరోజు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈ ప్రాంతంలో షాపులు ఒక్కరు పెట్టుకుంటాం అంటే కూడా .. ఒప్పుకోకుండా ఆ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడింది వైఎస్ఆర్సిపి. ఈరోజు మీరు ఇక్కడ పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేయకుండా.. ఈ విధంగా మీరు దీనిని ఇవ్వడానికి మీకు ఏ హక్కు ఉంది అని అన్నారు.22) దీని వెనక దురుద్దేశంమీరు చెబుతున్నట్టు ఇక్కడ పేదలకు షాపులు .. అన్న మాటలు నిజం కాదు.. మీ దగ్గర ఉద్యోగం చేస్తు మీ ఎలక్షన్స్ లో మీకోసం పని చేసిన నారాయణ మహిళా టీం కోసం .. మీరు వారికి భవిష్యత్తులో వ్యక్తిగత జీతాలు ఇవ్వకుండా.. వారందరికీ తల ఒక షాపు ఇవ్వాలన్న అనాలోచిత నిర్ణయం మేరకే… మీరు అడ్డగోలుగా ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. మీ వాళ్లే ఈ షాపులకు దరఖాస్తు చేసుకోనే విధంగా.. ఆ షాపులు కూడా వారికే వచ్చేలాగా.. మీరు తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారు అని అన్నారు.మీ దగ్గర ఉండే 200 మంది ఉద్యోగస్తులకు షాపుల ఇవ్వడం కోసం.. కొన్ని వేల ఎకరాలకు నీరు అందించే.. రాష్ట్ర స్థాయి కెనాల్ ను దాని కింద ఉన్నటువంటి.. అనేక మండలాల రాకపోకల గురించి ఆలోచించకుండా కేవలం మీ దగ్గర పనిచేసే 200 మంది గురించి ఆలోచించి మీరు ఇలా చేయడం అనేది చాలా దారుణమైన విషయం.. దీన్ని ప్రజలు క్షమించరనేది.. గుర్తించుకోవాలి అని అన్నారు.రేపు మా ప్రభుత్వం వస్తే వీటిని అక్కడ తొలగించి మంచి ప్రదేశాలలో షాపులను తరలించడం జరుగుతుంది అని అన్నారు. అభ్యంతరం ఉన్న అంశాలపై 26-12-2024 తేదీ న హైకోర్టు కు వెళ్లడం జరిగింది అని అన్నారు.ఇందులో చాలా లోపాలు ఉన్నాయాన్న విషయాన్ని 19-02-2025 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను సంప్రదించడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ 10-03-2025 జాయింట్ కమిటీ వేశారు.. ఆ కమిటీ కూడా అందులో లోపాలు ఉన్నాయన్న.. విషయాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కు తెలియజేసింది.అందుకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని ప్రికాషన్స్ తప్పకుండా తీసుకోవాలని తెలియజేసింది..అప్పటివరకు షాపులు కేటాయింపులు జరపవద్దని ఆదేశించింది.అక్కడ ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్య విషయంపై కూడా హైకోర్టు సంప్రదించడం జరుగుతుంది.


