

గూడూరు, మన న్యూస్:- ఈనెల 15వ తేదీ గూడూరు పట్టణంలో జరిగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి పాల్గొంటారని కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారు .
గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు మంత్రి జనార్దన్ రెడ్డి పర్యటనపై చర్చించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ గూడూరు పట్టణంలో జరిగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి పాల్గొంటున్నారని అన్నారు నాయకులు తమ ప్రాంతాల్లో ఎక్కడైనా రోడ్ల సమస్య ఉంటే తెలియజేస్తే మంత్రికి తెలుపుతామని
వెల్లడించారు నాయకులు కార్యకర్తలు పాల్గొని మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి పులిమి శ్రీనివాసులు ,వెంకటేశ్వరరాజు ,బిల్లు చెంచురామయ్య, శివకుమార్, జలీల్ ఇతరులు పాల్గొన్నారు .
