

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లోని ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 12వ తేది శనివారం అర్ధరాత్రి నుండి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వారి సమస్యలు పరిష్కారం కొరకు సమ్మె లోనికి వెళ్లడం జరుగుతుంది. పై విషయమై నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు పలు దపాలు మంత్రులకు,ఎమ్మెల్యేలను కలిసి సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, వారిని కలిసినా ఎటువంటి ప్రయోజనం కనపడకపోవడంతో వారి నుండి సమాధానం రాకపోవడంతో 12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమవడం జరిగిందని. ఇందులో భాగంగా గూడూరు మున్సిపల్ పరిధిలో ఇంజనీరింగ్ విభాగం లో పనిచేస్తున్న కార్మికులను సంబంధిత సి.ఐ.టి.యు నాయకులు జోగి.శివకుమార్, బి.వి.రమణయ్య లు శనివారం ఉదయం మస్టరు పాయింట్ వద్దకు వెళ్లి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులతో సమ్మె విషయమై చర్చించడం జరిగింది. డిమాండ్స్: – జి.ఓ. నెం.36 జీతాలు వర్తింపజేయాలని, 1-3-2024 ప్రకారం రూ.21,000/- రూ.24,500/- జీతాలు చెల్లించాలని,17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలైన రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎక్స్ గ్రేషియా పెంపు, దహన సంస్కరాలు పెంపు, ఇతర డిమాండ్స్ పై గూడూరు మున్సిపల్ కమిషనర్ ఎ. వెంకటేశ్వర్లుకు నోటీసు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి దారా.కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్, సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య, అధ్యక్షులు పామoజి మణి, నాయకులు పుట్టా శంకరయ్య,ఎస్.డి.రఫీ, నారాయణ,ఎంబేటి.చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
