ఇదేనా సుపరిపాలన?అధికారులు విధులకు డుమ్మా అవస్థల్లో ప్రజలు.

ఉరవకొండ, మన న్యూస్ : ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు శుక్రవారం విధులకు డుంబా కొట్టారు. వారు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. తద్వారా ప్రజలు లబ్ధిదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇదేనా సుపరిపాలన అంటూ బాధితులు గోడు వెల్లబోసుకున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి హాజరు కావడంతో తమ పనులు పూర్తిగా నిర్వహించినట్లు వారు ఫీలవుతున్నారు. యధావిధిగా పనులు సక్రమ విధులను నిర్వర్తించటం లేదని విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయానికి హాజరైన లబ్ధిదారులకు కాలి కుర్చీలే దర్శనం ఇస్తాయి. వారి గోడు ఎవరికి చెప్పుకోవాలన్నది మీ మాంస.
ఆర్థిక మంత్రి డైనమిక్ లీడర్ పయ్యావుల కేశవ్ సేవలు అమరావతికి పరిమితమయ్యాయి. ఆయన సోదరుడు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు తమను ఎవరు ప్రశ్నిస్తారులే అనే భావములు సర్వత్రావెల్లువెత్తుతున్నాయి.
వేలాది రూపాయలు జీతాలు పుచ్చుకొని ఇష్టారాజ్యంగా అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. కష్టపడి పని చేసే ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులు చెల్లింపులో చొరవ చూపరు, ఆయా శాఖల కార్యాలయాలకు హాజరయ్యే లబ్ధిదారులు నిత్యం అధికారుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇక పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన పరిష్కరించిన పాపానికి వెళ్లరు. మొక్కుబడిగా ప్రతి సమస్యను పరిష్కరించినట్లు ముగింపు సందేశాలను పంపిస్తున్నారు. అధికారుల పనితీరు మారాలి. అందుబాటులో లేని అధికారులపై మంత్రివర్యులు నిరంతర సమీక్ష చేయాల్సి నా అవసరం ఎంతైనా ఉంది. మంత్రి ముఖస్తుతి కోసం ఒకలా కార్యక్రమం ముగిసిన పేమట మరోలా వ్యవహరించే అధికారుల తీరుపై మార్పు ఎంతో అవసరం ఉంది.
కాగా అవినీతి, అక్రమాలను, ఎండగట్టాల్సిన రెండు వామపక్ష పార్టీలు సైతం అధికారుల లోపభూయిష్ట చర్యలపై చర్యలు తీసుకోవడంలో ఒత్తిడి తేవడంలో నిద్ర మత్తులో జోగుతున్నాయి. ఇప్పటికైనా వామపక్షాలు మేల్కొని, జిల్లా అధికారులు స్పందించి మెరుగైన సేవలు అందించి నిజమైన సుపరిపాలనకు నాంది పలికి ముఖ్యమంత్రి, ఆయన తనయుడు పెద్ద చిన్న బాబుల సంకల్పం నెరవేరే దిశగా అడుగులు వేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..