12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్ళనున్న మున్సిపల్ కార్మికులు. సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లో ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో శుక్రవారం రోజు రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపుమేరకు మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ గూడూరు పట్టణంలోని పురవీధులలో సి.ఐ.టి.యు జెండాలు చేత పట్టుకొని “మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి – సిఐటియు జిందాబాద్” -“సమాన పనికి – సమాన వేతనం” ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకు 36వ జి.ఓ.వర్తించాలి, కనీస వేతనం రూ.26,000/-వేల రూపాయలు ఇవ్వాలి, పది గంటల పని విధానాన్ని ఆపాలి, అంటూ నినాదాలుతో మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి ధారా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికులకు అందరికీ సంక్షేమ పథకాలు, తల్లికి వందనం వర్తింపచేయాలని, మున్సిపల్ కార్మికులు చనిపోతే దహన సంస్కారాలకి 20,000 పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుటి, ఎక్స్ గ్రేషియా పెంపు, గత 17 రోజులు సమ్మె కాలపు ఒప్పందాలు, వెంటనే అమలు చేయాలని గత ఐదు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో నిరసనలు తెలియజేస్తున్నా, కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేనట్లుగా ప్రవర్తించడం బాగాలేదని, మున్సిపల్ కార్మికులకు రావలసినవే అడుగుతున్నారే తప్ప అదనంగా ఇంకేమీ కోరడం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన మంత్రివర్గం చర్చల్లో మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల పట్ల, చర్చించి న్యాయం చేస్తారని ఇప్పటిదాకా వేచి చూసామని కానీ మంత్రివర్గ చర్చల్లో మున్సిపల్ కార్మికుల పట్ల ఎటువంటి చర్చలు జరపకపోవడం అన్యాయమని, ఇకనైనా ప్రభుత్వం వెంటనే మంత్రివర్గంతో చర్చలు జరిపి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు, ఎన్నికలలో ఇచ్చిన హామీలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. లేని పక్షంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్లడం జరుగుతుందని, ఇప్పటికైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకొని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు, న్యాయం చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంఘం ఉపాధ్యక్షులు ఎన్.. వెంకట రమణయ్య, సహాయ కార్యదర్శి సి.హెచ్.రాజేష్, గూడూరు పట్టణ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి రమణయ్య, అధ్యక్షులు పామంజి మణి,జి.శ్రీనివాసులు, ఆర్. ఆనంద్,ఎస్.శివ,ఎంబేటి చంద్రయ్య, శివరామయ్య, రాఘవ, వెంకట రమణయ్య, చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా