74 వ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు…

గూడూరు, మన న్యూస్ :- 74 వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్బంగా మొదటగా సీనియర్ కామ్రేడ్ మెకానిక్ శాంతకుమార్ గారి చేతులు మీదుగా ఎంప్లాయీస్ యూనియన్ జెండా ఆవిష్కరణ చేసినారు. తదుపరి ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ గురించి క్లూప్తంగా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ P.సుబ్రహ్మణ్యం రాజు డిపో అధ్యక్షులు Y. V. నారాయణ మాట్లాడుత భారతదేశానికి స్వతంత్రం రాక ముందు రోడ్డు రవాణా సంస్థ నిజాం రైల్వేలలో అంతర్భాగంగా వుండేది అని ఆ తరువాత కాలంలో 1952 నాటి నుండి ఆర్టీసీ సంస్థగా ఏర్పడ్డాక సంస్థలో మొట్టమొదటి యూనియన్‌గా 11 జూలై 1952లో ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పడి కార్మికుల అండదండలతో వచ్చే ఏడాది 2026 లో 75 సంవత్సరంలో అడుగు పెడుతూ వజ్రోత్సవ దిశగా పరుగులు పెడుతున్న యూనియన్ ఎంప్లాయీ స్ అని మన సంఘానికి మొదటి అధ్యక్షులుగా కాః సయ్యద్ ఖాసీం (డ్రైవర్ ) ప్రస్తుతం అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు కూడా డ్రైవర్ గానే వచ్చినవారే,అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాఃరాఘవేంద్రరావు దేశాయి గారు (కండక్టర్)గా పనిచేశారు. ప్రస్తుతం మన ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్యగారు కూడా కండక్టరే..నాటి నుండి నేటి వరకు కార్మికుల గుండెచప్పుడు – మెజారిటీ కేడర్ ఉన్న నాయకులు వున్నారంటే అది EU మాత్రమేఅని కార్మిక, శ్రామిక వర్గం కోసం జన్మించిన ఈ యూనియన్ అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యంతో ఎన్నో ఎదురు దెబ్బలు తిని కార్మికుల కోసం 8 గంటల పని దినాల్ని తీసుకొచ్చింది, చట్టబద్ధం చేసింది, సిటీ సర్వీస్‌లలో మాత్రం 7.30గంటల డ్యూటీలు వుండేట్లు యాజమాన్యాన్ని ఒప్పించింది. కార్మికుల కోసం, వారి మనుగడ కోసం, వారి సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో ఆందోళనలు మరెన్నో ఉద్యమాలు జరిపి కార్మిక అభిమానాన్ని చూరగొన్నది. ఇప్పుడు కార్మికులు అనుభవిస్తున్న “వీక్లీ ఆఫ్” ఎంప్లాయీస్ యూనియన్ సాధించిన ఘనతే అని సగర్వాంగా చెప్పడం అతిశయోక్తి కాదు. 1952లోనే కార్మికుల సంక్షేమం కోసం సి.సి.ఎన్.ను స్థాపించారు. నేడు అది ఆసియా ఖండంలోనే బెస్ట్ సొసైటీగా గుర్తింపు పొందింది. ఆగస్టు 1953లో 16 రోజుల వీరోచితమైన సమ్మె అటు ప్రభుత్వాన్ని, ఇటు యాజమాన్యాన్ని అతలాకుతలం చేసింది. తెలంగాణ సాయుధ పోరాటం సందర్భంగా యూనియన్ నాయకులెందరో అండర్ గ్రౌండ్ కెళ్ళారు. ఎందరో నాయకులు జైలుకెళ్ళి లాఠీ దెబ్బలు తిన్నారు. ఉద్యమాలను ఊపిరిగా పీల్చారే తప్ప, ఊరి కొయ్యలకు ఏనాడూ భయపడలేదు. క్రమశిక్షణలో గానీ, విధి విధానాలలో గానీ, అంకితభావంలో గానీ ఈ యూనియన్‌కు మరే యూనియన్ సాటిరాదు అన్న విధంగా తీర్చిదిద్దారు మన పెద్దలు. కారుచీకటిలో కాంతి పుంజం ఎలా వెలుగునిస్తుందో… ఆర్టీసి కార్మికుల హృదయాంతరాలలో ఎంప్లాయీస్ యూనియన్ అలా వెలుగుతూనే వుంది. ఐక్య ఉద్యమాలకు ఎంప్లాయీస్ యూనియన్ పెట్టింది పేరు. 1967లోనే తొలి ఐక్య ఉద్యమాన్ని ఆర్టీసిలో నిర్వహించి ఐక్య ఉద్యమ సారధిగా పేరు గడించింది. కార్మికుల శ్రేయస్సుకోసం, సంస్థ మనుగడ కోసం 2001లో నిర్వహించిన 24 రోజుల సమ్మె యావత్ భారతదేశ కార్మికుల దృష్టిని ఆకర్షించింది. ఆర్టీసిలో ఎన్నో యూనియన్లు మఖలోపుట్టి పుబ్బలో పోయినట్లుగా ఎన్ని యూనియన్లు పుట్టి గిట్టినా ఎంప్లాయీస్ యూనియన్ నాటికి నేటికీ సింహరాజంలా వుండిపోయింది. ఎంతో మాస్ ఫాలోయింగ్ వున్న ఈ యూనియన్ మరెన్నో మలి వసంతాలు జరుపుకోవాలని, మరెంతో మంది కార్మికుల అభిమానాన్ని చూరగొనాలని ఆదిశగా నిరంతరం ఏపిపిటిడి ఉద్యోగుల హక్కుల సాధనలో నిరంతరం ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ సంస్ద పరిరక్షణ కోసం..ఆర్టీసి ఉద్యోగుల హక్కుల సాధన కోసం పోరాటాలకు సైతం వెనుకాడ వద్దని శ్రేణులకు ఇ.యు నాయకత్వం పిలుపు నిస్తూ ఉంది. ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్ధిక ప్రయోజనాలు కలిగించే సంఘం ఏదో మీరే ఆలోచించండి..! ఆర్టీసీ ఉద్యోగులకు నిరంతరం అందుబాటులో వుండి సమస్యలు పరిష్కారమే కాకుండా, ఆర్ధికంగా కూడా ఆదుకున్నటు వంటి యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమేనని సగర్వంగా చెప్పగలం.2013 పే-స్కెల్ ను ఇ.యు గుర్తింపు కాలంలో విభజన రాష్ట్రంలో ఉమ్మడి ఆర్టీసీగా వున్నప్పుడు 8 రోజులు సమ్మె చేసి తేదిః13.05.2015 న హైదరాబాద్ లో అప్పటి రవాణాశాఖామంత్రి శ్రీ.సిద్దా రాఘవరావు, కార్మిక శాఖామంత్రి శ్రీ.కింజరపు అచ్చెంనాయుడు ఆద్వర్యంలో ఆర్టీసి వి.సి & యం.డి నండూరి సాంబశివరావు ఉన్నప్పుడు 43 శాతం పిట్మెంటు సాధించి సమాజంలోనే ప్రభుత్వ ఉద్యోగులవలే తల ఎత్తుకొనేలా చేసింది ఇ.యు మాత్రమే. ఈ ఒప్పందంలో బాగంగానే 2013, 2014 ఎన్ క్యాష్మెంట్ 5 సంవత్సరాలు తరువాత 8% వడ్డీతో బాండ్లు ఇప్పించినప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా గట్టి నిర్ణయం తీసుకొని ఆ డబ్బులు మొత్తం ఉద్యోగులకు ఇప్పించినది ఘనత ఇ.యు మాత్రమే కదా.. ఆలోచించండి..!
2013 పే-స్కెల్ అరియర్స్ మొత్తం ఒక్క రూపాయి నష్టపోకుండా బాండ్ల రూపములో తీసుకొని రిటైర్డ్ అయిన వారికి ఎప్పటికప్పుడు అరియర్సు చెల్లింపులు చేయిస్తూనే తదుపరి 4 విడతలలో సర్వీసులోని అందరికి అరియర్సు రూః750 కోట్లను ఆర్టీసి ఉద్యోగులకు ఇప్పించినది కూడా ఇ.యునే.2017 పే-స్కెల్స్ ను అప్పటి గుర్తింపు సంఘం అయిన NMU నాయకత్వం చేసివుండాలి. కాని వాళ్ళు చేయలేక గుర్తింపు కాలం గడువు పూర్తవుతున్న సందర్భంలో IR తీసుకొని వాళ్ల గుర్తింపు కాలమంతా సన్మానాలు, సత్కారాలతో కాలం గడిపేసి మౌనం పాటిస్తే 2018 ఆగస్టులో గుర్తింపులోకి వచ్చిన ఎంప్లాయీస్ యూనియన్ 2017 వేతనాల సవరణ కోసం సమ్మె నోటీసును JAC గా NMU కలసి రాకపొయినా సరే అన్ని సంఘాలను కలుపుకొని సమ్మె నోటీసు ఇస్తే ప్రభుత్వం స్పందించి అప్పటి రవాణాశాఖా మంత్రి కింజరపు అచ్చెంనాయుడు క్యాంపు కార్యాలయంలో తేది:05-02-2019 న రాత్రి ఆర్టీసి వి.సి & యం.డి గౌః యన్.సురేంద్రబాబు గారి సమక్షంలో 25% శాతం టెంపరరీ ఫిట్మెంట్ ఇప్పించి ఇంక్రిమెంట్ల రేటును 200 శాతం పైబడి పెంచిన యూనియన్ ఇ.యు కాదా..!
ఇది ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు కాలంలో జరిగిందా లేదా… ఒక్కసారి ఆలోచించిండి. ఆర్టీసిలో విలీనం జరిగినంత వరకు 14 సార్లు వేతన సవరణలు జరిగితే 9 సార్లు EU చేస్తే, NMU నాయకత్వం 5 సార్లు మాత్రమే వేతన సవరణలు చేసారు.EU వేతానాల సవరణ ఎప్పుడు చేసినా ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా పిట్ మెంటు ఇప్పించాము..లేదా సమానంగానైనా ఇప్పించిన ఘనత EU.
కానీ..ప్రభుత్వ 2009లో ప్రభుత్వ ఉద్యోగులకు 39% పిట్ మెంటు ఇచ్చినప్పుడు ఆర్టీసి కార్మికులకు 2009 RPS లో 24% పిట్ మెంటు ఇప్పించి 15% తక్కువ ఇప్పించిన ఘనత NMU ది.
అలాగే 2005 లో ప్రభుత్వ ఉద్యోగులకు 16% పిట్ మెంటు ఇస్తే ఆర్టీసి కార్మికులకు 12% పిట్ మెంటు ఇప్పించి 4 శాతం తక్కువ ఇప్పించిన ఘనత కూడా NMU దే కదా..మొత్తం కలిపి NGO లకంటే 19% తక్కువ వేతనాల సవరణ చేసిన ఘనత NMU ది అయితే 2013 RPS లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43% ఇప్పించిన ఘనత EU ది కదా..2017 RPS జరిగేటప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు పిట్ మెంటు అవ్వక పోయినా సరే 25% పిట్ మెంటు ఇప్పించుకున్న ఘనత EU దే కదా..మొత్తం EU గుర్తింపు కాలంలో 43+25=68% పిట్ మెంటు ఇప్పించినది EU నే కదా ఆనాటి నుండే కదా ఆర్టీసి ఉద్యోగుల ఆర్ధిక స్థితి మెరుగు పడింది ఇది వాస్తవం కాదా..!2017 పే-స్కెల్ అరియర్స్ ను రిటైర్డ్ అవుతున్న వారికి ముందుగా పూర్తి పేమెంట్ చేసిన తరువాత 2020 నుండి మూడు విడతల్లో ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ విలీనం జరిగినందున విలీనం అనంతరం 2017 పి.ఆర్.సి కి సంబందించిన సుమారు రూః 850 కోట్లను పూర్తి స్థాయిలో ఇప్పించిన ఘనత EU ది కదా..ఈ ఒప్పందం EU లో గుర్తింపు కాలంలో చేసుకున్నదే కదా ఆలోచించండి. ఇ.యు గుర్తింపు కాలంలో 2017 పి.ఆర్.సి ని సకాలంలో 2019 లో విలీనం కాకముందు పి.ఆర్.సి ఒప్పందం చేసుకున్నందున విలీనం అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే 11 వ పి.ఆర్.సిలో కూడా పొందగలిగాం. ఇది ఇ.యు రాష్ట్ర నాయకత్వం తీసుకున్న చొరవతో జరిగింది కాదా ఒక్కసారి ఆలోచించండి. గత ఆరు సంవత్సరాల నుండి పెండింగులో వున్న పదోన్నతుల కోసం ఇ.యు రాష్ట్ర కమిటి గట్టిగా కృషి చేస్తున్నది. ఈ నెలాఖరు నాటికి పదోన్నతులు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది యం.డి గ
హామీ కూడా ఇచ్చారు. ప్రభుత్వం నుండి రావల్సిన 11 వ పి.ఆర్.సి 24 నెలలు అరియర్సు, DA అరియర్సు, కొత్త DA లు అమలుకు, పెండింగు లీవ్ ఎన్ క్యాష్ మెంటుకు, రిటైర్డు ఉద్యోగుల బకాయిలు సాదించుకోవడం కోసం ఏపిజేఏసి అమరావతి నాయకత్వం ఆద్వర్యంలో ఇ.యు రాష్ట్ర నాయకత్వం కృషిచేస్తున్నది.విలీనం అనంతరం ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు గారి సహకారం మనయూనియన్ కు ప్రభుత్వ గుర్తింపు సంఘంగా సాధించుకున్నాము..విలీనం ముందున్న సౌకర్యాలు, అప్పట్లో పదోన్నతులు ఇచ్చి జీతాలు రానివారికీ జీతాలు, పెండింగులో వున్న కారుణ్య నియామాకాలు తదితర సమస్యలు పరిష్కరించుకోగలిగాం..ఇంకా ప్రభుత్వ పరిధిలో పెండింగు ఉన్న సమస్యలు పరిష్కారం కోసం ఇ.యు రాష్ట్ర కమిటి కృషి చేస్తున్నది. నిరంతరం విజయవాడలో ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ అటు ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కారంలోను ఇటు పి.టి.డి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలోను ఎప్పటికప్పుడు ఆర్టీసి యం.డి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్న (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ కు మీరంతా అండగా ఉంటూ EU భలోపేతానికి కృషి చేయాలి. ఇ.యు బలోపేతానికి పి.టి.డి ఉద్యోగులందరూ సహకరిస్తే మరింత ఉత్సాహంతో ఆర్టీసి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం పని చేస్తామని హామీ ఇస్తున్నాము అని 74 వ ఆవిర్భా దినోత్సవం సందర్బంగా కార్మికులు, ఉద్యోగులకు తెలియచేసినారు.తదుపరి భారీ కేక్ ని EU రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ P. సుబ్రహ్మణ్యం రాజు గారు మరియు రిటైర్డ్ అయిన B. చెంగయ్య గారు, Y. V. S. రాజు గారు, V. శివారెడ్డి గారు కట్ చేసి 74 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకొంటూ స్వీట్ లు పంచుకొన్నారు.

Related Posts

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

మన న్యూస్ సింగరాయకొండ:- ఆరోగ్య సంరక్షణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ధీరేంద్ర పిలుపు ఇచ్చారు.సింగరాయకొండ చంద్రబాబు నాయుడు కాలనీ లోని ఉమర్…

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, కొండపి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డా. ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో “బాబు ష్యూరిటీ మోసం – గ్యారెంటీ” పేరుతో నిర్వహించిన విశేష సమావేశం ఘనంగా జరిగింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.

మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.

కూటమి పాలనలో అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

కూటమి పాలనలో  అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.