

మన న్యూస్ పాచిపెంట,జూలై 7:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమము,అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని తనకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన ఆశిస్సులు మనకు పుష్కలంగా ఉన్నాయని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని ఈ సందర్భంగా అక్కడ ఉన్న గిరిజన మహిళలకు కరపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల రహదార్లు అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని, సాలూరు నియోజకవర్గంలో 15 ఏళ్లుగా జరగని అభివృద్ధి ఒక ఏడాది లో జరిగిందని సంధ్యారాణి అన్నారు. సోమవారం నాడు పాచిపెంట మండలం పూడి గ్రామంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సభకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు హాజరై ఘన స్వాగతం పలికారు. సభ విజయవంతం చేశారు. ముందుగా పూడి నుంచి కేరంగి గ్రామానికి 8 కిలోమీటర్లు 6కోట్ల రూపాయలుతో నిర్మించిన రహదారి ప్రారంభోత్సవం చేసారు.బి టీ రహదారి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె గిరిజన సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజలును ఉద్దేశించి మాట్లాడుతూ సుమారు 20 గ్రామాలకు పైగా ఈ రహదారి నిర్మాణం ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా డోలీలు మోత తప్పిందని, కొండలపై ఉన్న గిరిజన ప్రజలకు విద్య, వైద్యం,త్రాగునీరు, సాగునీరు ప్రతి గ్రామానికి అందించి ప్రతి గ్రామానికి రహదారి నిర్మించడమే ప్రభుత్వం ధ్యేయమని హామీ ఇచ్చారు.కోదు వలస రోడ్డు 2017 లో మంజూరు అయితే ఇంతవరకు ఎందుకు నిర్మాణం చేపట్లేదని తాను వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి పనులు పూర్తి చేశామని తెలిపారు. సాలూరు నియోజకవర్గంలో ఏడాది లో 200 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టామని దాదాపుగా పూర్తికావస్తున్నాయనితెలిపారు.కానీ తాను మాత్రం ఏజెన్సీలో రహదారులన్నీ పూర్తిచేసి డోలీ మోత లేకుండా గిరిజన ప్రజలకు మంచి పరిపాలన అందిస్తానని సభాముఖంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏజెన్సీ సర్పంచులు ఎంపీటీసీలు అంతా మంత్రి సంధ్యారాణిని కొనియాడారు. మా గ్రామాలు రహదారులు అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రికీ జేజేలు పలికారు. మరలా మీరే మాకు ఎమ్మెల్యే కావాలని సభాముఖంగా నినాదాలు చేశారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్లు మన రాష్ట్రం ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి మనమంతా రుణపడి ఉన్నామని ఆమె తెలియజేశారు.ఎన్నా ర్జీ జిఎస్ ద్వారా పనులు చక చక జరగాలంటే స్థానిక సర్పంచులు అందరూ ప్రభుత్వానికి సహకరించాలని అభివృద్ధి కీ సహకరించాలని కోరారు. గోకులాలు నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు . సాలూరు నియోజకవర్గం లో 300 గోకులాలు మంజూరయ్యాయని తెలిపారు. గతంలో కంటే ప్రస్తుతం గిరిజన ప్రజలకు ప్రభుత్వం రేషన్ సరుకులు మార్పు చేసిందని గత ప్రభుత్వం బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బియ్యం కప్పు పంచదార తదితర రేషన్ సరుకులు అందిస్తామని తెలిపారు.వసతి గృహాల్లో పిల్లలకు సన్నబియ్యం, వసతి గృహల అభివృద్ధికి 155 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.ఐ టీ డి ఏ సూపరిండెంట్ ఇంజనీరు ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటికీ రాష్ట్రంలో 2500 రహదారులు నిర్మించవలసి ఉందని ఆ రహదారి పనులన్నీ ఇప్పుడు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోగిరిజన రహదారులకు ప్రభుత్వం 1300 కోట్లు రూపాయలు వెచ్చించిందని తెలిపారు.ఈ సందర్భంగా నూతన సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధి ద్యేయంగా మంత్రి సంధ్యారాణి ముందుకు నడుస్తున్నారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇంటి వద్ద ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారని మీ సమస్యలు చెప్పండి పరిష్కరిస్తామని ఆయనఅన్నారు.ఆమె దైర్య శాలి ప్రతి ప్రాంతం అభివృద్ధి కోసం అహర్నిశలు పరితపిస్తూ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు,పాంచాలి సర్పంచ్ సీనియర్ నేత యుగంధర్ మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గాన్ని ఆమె రోల్ మోడల్ గా తీర్చి దిద్దితారని ఆయన అన్నారు. ఆమె చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా ప్రజలకు తెలియజేశారు. ప్రతిపక్షం స్పీడ్ బ్రేకర్లు వేసిన ఎక్కడ ఆగకుండా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సంధ్యారాణి ముందుకు నడిపిస్తున్నారనిఆమెకు అభినందనలు తెలిపారు. అందరము కలిసికట్టుగా ముందుకి నడిచి అభివృద్ధి సాధించుకోవాలని కోరారు. ఐటిడిఏ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులు గురించి వివరించారు. పై కార్యక్రమముకు ఇ ఇ మణి రాజు,ఎంపీడీవో బీజే పాత్రో తాసిల్దార్ రవి, పలువురు సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పార్టీ కార్యకర్తలు ప్రజలు హాజరయ్యారు.
