

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మండలం నెల్లటూరు గోగినేనిపురం ఎ.పి.ఎస్.బి.సీ.ఎల్ జిల్లా స్టోర్స్ హమాలీల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాలను సోమవారం ఆవిష్కరించి పంపిణీ చేయడం జరిగినది. అనంతరం సి.ఐ.టి.యు గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్ లును రద్దు చేయాలని, లేబర్ కోడ్ లు కార్మిక వర్గానికి మరణ శాసనం కాకూడదని, ధ్వంసం అవుతున్న కార్మిక హక్కుల సాధనకై జరుగుతున్న జూలై 9 సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హమాలీల సంఘం అధ్యక్షులు చెముడు బోయిన రాగయ్య, నాయకులు వై.రమేష్ డి.మస్తాన్,ఎన్.జనార్ధన్,ఇ. కిష్టయ్య,వి.రాఘవరావు,ఇ. రవీంద్ర,యస్.గోవర్ధన్, వాకా.సుబ్బయ్య, పి. శ్రీనివాసులు,కె.మురళి తదితరులు పాల్గొన్నారు.