

మన న్యూస్ సాలూరు జూలై 7:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకొని ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండని వైఎస్సార్ సిపి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలో వున్న కోదండరామ కళ్యణ మండపంలో బాబు ష్యూరీటి అబద్దాలు గ్యారెంటీలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా రాజన్నదొర మాట్లాడుతూ, ఎన్నికలలో గెలిచిన మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారా, నేను అభివృద్ధి చేస్తానా అని అన్నారు..మంత్రి దృష్టిలో ఇంకా నేనే ఎమ్మెల్యే, మంత్రి అనుకుంటున్నారా అని అన్నారు.. ప్రతిపక్ష నాయకులపై విమర్సలు తగ్గించుకొని అబివృద్ధి పై దృష్టి పెట్టాలన్నారు. ఏ ఒక్క పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా ఎలక్షన్లలో నిలబడి పోరాడిన వ్యక్తి జగన్మోహన్రెడ్డే అని అరుకు ఎంపి తనూజరాని అన్నారు . అలాంటి వ్యక్తిని స్తానిక మంత్రి పదే పదే విమర్శలు గుప్పించడం తగదన్నారు.ఇకనైనా విమర్శలు మానుకొని గిరిజనుల సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఎన్నికలలో గెలిస్తే సూపర్ సిక్స్ పదకాలను రాష్ట్ర ప్రజలకు అమలు చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తారన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు.