

ప్రజలంటే పయ్యావులకు ప్రాణం.. పయ్యావులంటే తమకు ప్రాణం.
ఉరవకొండ మన న్యూస్: రూ. 3.25 కోట్ల రూపాయల మంజూరు తో నెరిమెట్ల – రాయపల్లి రహదారికి మహర్దశ పట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అద్వాన్న గ్రామీణ రహదారులపై దృష్టి సారించారు. ప్రజలు ఎన్నికల్లో భాగంగా ఆయన దృష్టికి తెచ్చారు. ఎన్నికల్లో ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం రహదారులకు మహర్దశ పట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు రాయంపల్లి రేగటి నాగరాజు నెరమెట్ల రాజాల శ్రీధర్ రెడ్డి, తిప్పారెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ శివప్ప విడుదల చేసిన ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రి పయ్యావుల మాటిచ్చాడంటే. పనిచేస్తాడు అంతే అన్నారు. పయ్యావులకు ప్రజలంటే ప్రాణం తమకు పయ్యావులంటే ప్రాణం అని నాయకులు పేర్కొన్నారు.
