

ఉరవకొండ మన న్యూస్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవ వేడుకలు, ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సమితి కార్యకర్తలు నాయకులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు.
ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం లో మండల గౌరవ అధ్యక్షులు ఈశ్వరయ్య మాదిగ,
నూతన మండల అధ్యక్షులు జెర్రిపోతుల విజయకుమార్ మాదిగ, ఉపాధ్యక్షులు హరి శంకర్, మాదిగ వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ మాదిగ, అధికార ప్రతినిధి మురళీకృష్ణ మాదిగ, మరియు నూతన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోMRPS 31 వ ఆవిర్భావ దినోత్సవం మరియు పద్మశ్రీమందకృష్ణ మాదిగ 60వ పుట్టినరోజు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కూడేరుమండలం ఇన్చార్జి* ఎంపీ పుల్లయ్య మాదిగ ముఖ్యఅతిథిగాహాజరై దండోరా జెండా ఎగరవేసి కార్యక్రమాని మరియు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 60వ పుట్టినరోజు పండుగను ఉద్దేశించి మాట్లాడుతూ 1994లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం లో కల్పించిన ఉమ్మడి 15% రిజర్వేషన్ 59 షెడ్యూల్ కులాలు జనాభా ప్రకారం ఉప వర్గీకరణ చేసుకుంటే అన్ని కులాలు రాజకీయంగా ఆర్థిక ఉద్యోగ రాజకీయ అభివృద్ధి చెందుతాయని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి 30 సంవత్సరాలు న్యాయంతో మాదిగల అమరవీరుల ప్రాణ త్యాగం కుటుంబ త్యాగం వ్యక్తిగత జీవిత త్యాగంతో అలుపెరుగని పోరాటం చేస్తే 2024 ఆగస్టు1వ తేదీన 30 సంవత్సరాల ఉద్యమ పోరాట వీరుని పోరాటాన్ని గుర్తించి సుప్రీంకోర్టు ఉపవర్గీకరణ అనుకూలమైన తీర్పు ఇవ్వడంతో మందకృష్ణ మాదిగ అన్నగారు మాదిగలకు వేయి తరాల భవిష్యత్తును కల్పించాడు కనుక ఆయన సాధించిన SCఉప వర్గీకరణలో మాదిగ మాదిగ ఉపకులాలలో ఉన్న యువత విద్యామంతులు నిరుద్యోగులు SCఉపవర్గీకరణలో ఉద్యోగాలు పొందితే నే 30 సంవత్సరాల పోరాటానికి గుర్తింపుని తెలియజేయడం జరిగినది తదంత్రం జండా ఎగరవేసి బర్త్ డే కేక్ కటింగ్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకొన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కూడేరులోని RDT ఆశ్రమంలో తల్లిదండ్రు లేని వందమంది పిల్లలకు బెడ్డు పాలు పంపిణీ చేయడం ఆర్డిటి అనాధశ్రమంలో తల్లిదండ్రులు లేని ముగ్గురి పిల్లలకు స్కూల్ యూనిఫాములకు కరుట్లపల్లి సర్పంచ్ అక్కులప్ప, MRPS సీనియర్ నాయకులు లక్ష్మన్న ఇరువురు 3000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కూడేరు గ్రామపంచాయతీ సర్పంచ్ లలితమ్మ, కూడేరు మండలం మొదటితరం ఉద్యమనాయకులు, ఎం రాజు మాదిగ సూర్యనారాయణ మాదిగ , లింగన్న మాదిగ ,లక్ష్మన్న మాదిగ
లక్ష్మీనారాయణ మాదిగ , రమణ మాదిగ , VHPS ముత్యాలు మాదిగ, మరియు కలగళ్ల కిరణ్ నరసింహ ఆంజనేయులు, అంతరంగం నరసింహ ముద్దులాపురం సత్యమయ్య, నూతన ఎమ్మార్పీఎస్ మండల కమిటీ నాయకులు , పవన్ కళ్యాణ్ మాదిగ, నాగరాజు మాదిగ, బాబు మాదిగ, కార్యకర్తలు మండలంలోని మాదిగలు పాల్గొనడం జరిగినది.

