

నింబగల్లులో నీటి వ్యవస్థ నిర్వీర్యం.అడుగు మేరకు పేరకు పోయిన మురికి.వ్యవస్థను ప్రక్షాళన చేస్తా.ప్రతిభకు పట్టం, ఉరవకొండ ప్రజలు రాజనీతిజ్ఞులు.
ఉరవకొండ మన న్యూస్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం 6నెలల్లోనే తాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు నీరందించిన ఘనత తెదేపాకు దక్కుతుంది. జనవరి 1, 2025 తేదీన ప్రారంభించిన ఈ తాగునీటి జూలై 7వ తేదీన ఆరు నెలల్లోగా ముగించిన ఘనత మంత్రి పయ్యావుల కేశవ్ కు దక్కుతుంది.
30ఏళ్లుగా ఉరవకొండ పట్టణంలో తాగునీటి సమస్య నెలకొంది. అదుపు తప్పిన తాగు నీటి వ్యవస్థను పయ్యావుల కేశవ్ ప్రత్యేకత గాడిన పెట్టారు. ప్రజల తాగునీటి ఇబ్బందులు వర్ణనాతీతం. వారానికి ఒక మారు 15 రోజులకు ఒక మారు, నెలకు ఒక మారు నీటిని విడుదల చేసి ప్రజల ప్రజలు కడగండ్లు చూశారు దీనంతటికీ పూర్తి బాధ్యుడు విశ్వేశ్వర్ రెడ్డి అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజం ఎత్తారు… ఐదు సంవత్సరాల క్రితం తాగునీటి పరిష్కారం కోసం అనేక పథకాలు రచించితే విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మీటరు పైపులైన్ వేయలేదని ఆయన ఆరోపించారు. దీంతో ప్రజలు ఇబ్బంది పడ్డారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు పీఏబిఆర్ డ్యామ్ నుంచి ఉదిరిపికొండ వరకు, అక్కడి నుండి ఉరవకొండ వరకు త్రాగునీటి సరఫరా చేసేందుకు రూ.22 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. జనవరి 1వ తేదిన ఈ పనులు ప్రారంభించి కేవలం 6 నెలల్లోనే పనులు పూర్తి చేశారు. సోమవారం ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు.
ప్రజల దాహార్తిని తీర్చే ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం తనకు సంతోషంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.. గతంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసేలా అన్ని పనులు చేశామని.. కానీ విశ్వేశ్వరరెడ్డి అసమర్థత నిర్లక్ష్యం వలన ప్రజలు ఇంతకాలం ఇబ్బందులు పడ్డారన్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కీర్తిశేషులు రోశయ్య హయాంలో మూడో ట్యాంకు తాను నిర్మించానన్నారు. పీఏబీఆర్ నుంచి కౌకుంట్ల మీదుగా రోశయ్య ముఖ్యమంత్రి పాలనలో పైప్ లైన్ వేయించి ఆనాడు దాహార్తి తీర్చామన్నారు. ఎన్నికల్లో ఉరవకొండ ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నానన్నారు. పీఏబీఆర్ సంపులో గత ఐదు సంవత్సరాలుగా ఏనాడు శుభ్రం చేయకపోగా ఒక్క అడుగు మేరకు మురుగు పేరుకుపోయిందన్నారు. తాను స్పందించి శుభ్రం చేయించానన్నారు. పూర్తిస్థాయిలో శుభ్రం చేయించడానికి రెండు మూడు నెలలు పడుతుందని కేశవ్ తెలిపారు. నింబగల్లు వద్ద నీటి వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం : నింబగల్లు వద్ద నీటి వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని కేశవ్ తూర్పారబట్టారు. అత్యవసర సేవల కోసం మైక్రో ఫిల్టర్లు తెప్పించినట్లు కేశవ్ పేర్కొన్నారు. మరో 15 రోజుల్లో నింబగల్లు నుంచి శుద్ధ జలం విడుదలవుతుందని. ప్రణాళిక సిద్ధం చేశాం రెడీ చేసాం అయితే పనిచేయలేని అసమర్ధుడు విశ్వేశ్వర్ రెడ్డి అని దుయ్య బట్టారు. ఉరవకొండ ప్రజలు విజ్ఞులని కేశవ్ కొనియాడారు. పనిచేసే వ్యక్తులకు పట్టం కట్టారన్నారు. ఉరవకొండ ప్రజల అండదండలే తనకు కొండంత శ్రీరామరక్ష అని. అభివర్ణించారు. పరిశుభ్రత మీద దృష్టి సారించి, ఇల్లు ఇళ్ల పట్టాలు పంపిణీ పై తన ఫోకస్ ఉంటుందని పేర్కొన్నారు.ప్రజలకు సేవకుడిగా కూలి నెంబర్ వన్ గా పని చేస్తాననిమంత్రి పయ్యావుల కేశవ్
కితాభిచ్చారు.