స్మార్ట్ మీటర్ల పై చంద్రబాబునాయుడు వైఖరి మార్చుకోవాలి

చిల్లకూరు మండలంలో పేదల సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి, చిల్లకూరు సిపిఐ మండల మహాసభలో జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్

గూడూరు, మన న్యూస్ :- రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాన్ని మోపే ఆలోచనను చంద్రబాబు నాయుడు మార్చుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి హెచ్చరించారు. చిల్లకూరు మండలం నెలబల్లి రెట్లపల్లి గ్రామంలో మండల మహాసభ రమేష్ అధ్యక్షతన బహిరంగ జరిగింది. బహిరంగ సభకు ముందుగా గ్రామం నడిబొడ్డునున్న జెండా మన వద్ద సిపిఐ శతవసంతాల ఎర్రజెండాను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ ఎగురవేశారు అనంతరం పేదలు ఎర్రజెండాలు చేతపుని బహిరంగ సభ వేదిక వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో సాగరమాల ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని అధిక ధరలు తగ్గించాలని ప్రజలపై భారాన్ని మోపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని నిజం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ సిపిఐ శతవసంత వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా శాఖ మండల జిల్లా మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో చిల్లకూరు మండలం మహాసభ ఘనంగా నిర్వహించడం ఆనందదాయకంగా ఉందని ఎర్రజెండా పోరాటాలలో సిపిఐ విజయాలలో ఆయన వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారానికి రాక మునుపు జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరారు నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా స్మార్ట్ మీటర్లను పగలగొట్టండని పిలుపునిచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక అదే విధానాలను కొనసాగిస్తూ స్మార్ట్ మీటర్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు గ్రామాల్లో స్పాట్ మీటర్లు పెడితే తప్పకుండా పగలగొట్టి లోకేష్ కు బహుమతిగా ఇస్తామని ఆయన ఎద్దేవా చేశారు గూడూరు నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కారం కాకుండా చిన్న సన్నకారు రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు సాగరమాల భూ సమస్య నక్కల వారి కండ్రిగ భూ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు అలాగే టైల్స్ పరిశ్రమ కోసం 750 ఎకరాలు రైతాంగం నుంచి తీసుకొని ఆ పరిశ్రమలు నడపకుండా భూములను నిరుపయోగంగా ఉంచడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు ప్రభుత్వానికి శక్తి శుద్ధి ఉంటే తక్షణమే పరిశ్రమను పునర్ప్రారంబించి అనేకమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ చెన్నం పెంచలయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనేక లొసుగులను ప్రవేశపెట్టి ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చాలని చూస్తున్నారని ఇది కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు నియోజకవర్గంలో ఉపాధి హామీ పనులు చేసే చోట ఫీల్డ్ అసిస్టెంట్లు పెత్తనం పెరిగిపోతుందని రాజకీయ పార్టీలుగా విభజించి పనులు చేయించడం మంచిది కాదని హెచ్చరించారు గ్రామీణ ప్రాంతాల్లో అసమానతలు పెరుగుతున్నాయని మారుతున్న కాలానుగుణంగా అసమానతలు తొలగిపోయి అందరినీ మనుషులుగా చూడాలన్న భావన ప్రతి ఒక్కరికి ఉండాలన్నారు రెట్టపల్లి భారత కమ్యూనిస్టు పార్టీ కి పుట్టినిల్లు లాంటిదని ఇక్కడ అనేకమంది ఎర్రజెండా నీడన అనేక పోరాటాలు జరిగాయని అదే విధంగా కళాకారులకు కూడా రెట్టపల్లి నిర్లయంగా ఉండేదని వారు గుర్తు చేశారు గూడూరు నియోజకవర్గ కార్యదర్శి శశి కుమార్ మాట్లాడుతూ మండలంలో ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం సిపిఐ పోరాటాల తప్ప మరొకటి లేదని ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం చిల్లకూరు సిపిఐ మండల కమిటీని ప్రకటించారు మండల కార్యదర్శిగా రమేష్ ను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ మహాసభలో ప్రజాసంఘాల నాయకులు సివిఆర్ కుమార్ నారాయణ రఘురామయ్య తలారి మస్తానయ్య సునీల్ సిపిఎం నాయకులు ముత్యాలయ్య తదితరులు పాల్గొన్నారు .

Related Posts

ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకోండి – వైయస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

మన న్యూస్ సాలూరు జూలై 7:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకొని ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండని వైఎస్సార్ సిపి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలో వున్న…

ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం – రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ పాచిపెంట,జూలై 7:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమము,అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని తనకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన ఆశిస్సులు మనకు పుష్కలంగా ఉన్నాయని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకోండి – వైయస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకోండి – వైయస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం – రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం – రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.సి.ఐ.టి.యు

జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.సి.ఐ.టి.యు

రూ. 3.25కోట్ల రూపాయలతో నెరిమెట్ల-రాయంపల్లి రహదారికి మహర్దశ.-మాట నిలుపుకొన్న మంత్రి పయ్యావుల.

రూ. 3.25కోట్ల రూపాయలతో నెరిమెట్ల-రాయంపల్లి రహదారికి మహర్దశ.-మాట నిలుపుకొన్న మంత్రి పయ్యావుల.

ఘనంగా మంద కృష్ణ, ఎమ్ ఆర్ పీ యస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా మంద కృష్ణ, ఎమ్ ఆర్ పీ యస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

విశ్వేశ్వర్ రెడ్డి అసమర్థతో ఉరవకొండ వాసులకు తాగునీటి కష్టాలు. మంత్రి పయ్యావుల ఫైర్.-30 ఏళ్ల తాగునీటి సమస్యకు 6 నెలల్లో పరిష్కారం

విశ్వేశ్వర్ రెడ్డి అసమర్థతో ఉరవకొండ వాసులకు తాగునీటి కష్టాలు. మంత్రి పయ్యావుల ఫైర్.-30 ఏళ్ల తాగునీటి సమస్యకు 6 నెలల్లో పరిష్కారం