

మన న్యూస్, పాచిపెంట, జూలై 3:- మాదకద్రవ్యాల వలన జీవితాలు నాశనం తో పాటు దుష్ర్పభావలు, సైబర్ నేరాలు వల్ల కలిగే అనర్దాలు, మహిళల రక్షణ పై ప్రజలకు, విద్యార్థులకి, యువతకు అవగాహన తప్పనిసరని విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టీ.ఐపిఎస్ పేర్కొన్నారు.గురువారం నాడు పాచిపెంట మండలం పార్వతీపురం మన్యం జిల్లా కు విచ్చేసిన విశాఖ పట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టిని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఐపిఎస్, పార్వతీపురం ఏఎస్పీ, అంకిత సురాన, ఐపిఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమోక్కను అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం పి. కోనవలస లో గల గిరిజన సంక్షేమ బాలికల కళాశాల నందు ఏర్పాటు చేసిన సంకల్పం కార్యక్రమానికి హాజరయ్యి, అక్కడ చదువుతున్న విద్యార్దిని లతో డిఐజి గోపీనాథ్ జెట్టి మమేకమై వారిని సమావేశపరిచి మాదకద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను సైబర్ నేరాలు వల్ల జరిగే అనర్ధాలను, మహిళల రక్షణ కొరకు రాష్ట్ర ప్రబుత్వం నిర్వహించే శక్తి యాప్ గురించి తెలియజేసి వాటినుంచి విద్యార్దినిలు ఎలా రక్షణ పొందాలో వివరించి వారిని చైతన్యపరిచాలనే ఉద్దేశంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు”సంకల్పం” కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టీ మాట్లాడుతూమాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలను మీ యువత ద్వారానే ప్రజలకు, వివరించి వారిలో చైతన్యం తీసుకొని వచ్చి, వారిలో మార్పు తెచ్చి, విద్యార్థులు, యువత డ్రగ్స్ బారిన పడకుండా మాదక ద్రవ్యాల నిర్మూలనకు వారిలో అవగాహన ముఖ్యమని భావనతో “సంకల్పం”, “మాదక ద్రవ్యాలుకు వ్యతిరేకంగా పోరాడుదాం” అనే కార్యక్రమం ద్వార అవగాహనా కల్పించామని పేర్కొన్నారు
ప్రస్తుత సమాజంలో నేరాలుపరంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదవుతున్న కేసుల్లో మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు కేసులు ఘననీయంగా పెరిగా యని,గంజాయి రవాణా చేయడం గాని త్రాగడం గాని పండించడం గాని నేరం కింద పరిగణించబడుతుందని ముఖ్యంగా యువత సరైనటువంటి మార్గంలో పడకుండా ఎక్కడైనా తప్పు త్రోవ పట్టినట్లయితే అది మీ యొక్క వ్యక్తిగత నష్టమే కాకుండా సమాజానికి కూడా చెడు జరుగుతుంది.అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం విద్యార్థులను ఉద్దేశించి నిర్వహించడం జరుగుతుందని ఎవరైతే పనిచేసుకునే యువత ఉన్నారో వాళ్లు ఎక్కువగా ఈ గంజాయికి బానిసవుతున్నారని ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అమాయకులు నిరక్షరాస్యులు తెలిసో తెలియకో వీటి మత్తులో పడుతున్నారని దానివల్ల జీవితం నాశనం అవుతుందని ,గంజాయి రవాణా చేయడం సేవించడం మన ఆధీనంలో ఉంచుకోవడం నేరమని ఈ నేరాలలో పడేటువంటి శిక్ష చాలా పెద్దదని సుమారు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అందువల్ల అలాంటి నేరాలు తెలిసి గాని తెలియక గాని మనం ఇరుక్కోకూడదని తెలియజేశారు.వాటివల్ల సమాజంలో గౌరవప్రద జీవనం గడపడం కూడా కష్టమని ఇవన్నీ గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలని తెలియజేశారు. గంజాయి రవాణాకి ముఖ్యంగా అమాయకుల్ని చిన్నపిల్లల్ని వాడుతున్నారని వాళ్లకి ఖర్చులకి డబ్బులని ఎరగా చూపి వారి యొక్క బ్యాగులోను స్కూల్ పిల్లల బ్యాగుల్లోను గంజాయి పెట్టి సరఫరా చేస్తున్నారని అదేవిధంగా చాక్లెట్ల రూపంలో కూడా గంజాయిని అందజేస్తున్నారు.కావున అటువంటి వాటికి కూడా దూరంగా ఉండాలని తెలియజేశారు. సైబర్ క్రైం, సోషల్మీడియా నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, డిజిటర్ అరెస్టు, పార్సిల్స్, , ఉద్యోగాలు ఇప్పిస్తాం అని అత్యాశ చూపడం పేరుతో వచ్చే ఫోను కాల్స్ ను నమ్మవద్దని ఒటిపి ,వ్యక్తిగత వివరాలు ఎవ్వరికి తెలియజేయరాదని తెలియజేసారు. ఈ తరహా కాల్స్ వచ్చినపుడు, ఎవరైనా సైబర్ నేరాల వల్ల నగదు పోగొట్టుకున్నప్పుడు భయబ్రాంతులకి లోనవకుండా తక్కువసమయంలో“గోల్డెన్ అవర్” విషయాన్నీ వెంటనే 1930కు లేదా సైబర్ క్రైం పోర్టల్ లో ఫిర్యాదు చేయాలన్నారు. అల చేయడం వల్ల నగదు బదిలీ కాకుండా నిలవరించవచ్చు అని తెలియజేసారు.ఈ తరహా నేరాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధానమన్నారు. మీకు తెలిసిన విషయాలను క్షేత్ర స్థాయిలో మీ బంధువులు, స్నేహితులకు అవగాహన కల్పించి, డ్రగ్స్ కు అలవాటు పడకుండా, సైబరు మోసాలకు గురికాకుండా చూడాలని కార్యక్రమానికి హాజరైన విద్యార్దులకి డిఐజి గోపినాధ్ జట్టి కోరారు.జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ మాట్లాడుతూ గంజాయి మత్తులో దించడానికి చాలామంది ఎదురు చూస్తున్నారని సరదాగా చేసే పని జీవితాన్ని నాశనం చేస్తుందని గంజాయి సేవించడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందని తెలియని శక్తి లభిస్తుందని చెప్పి మిమ్మల్ని వాటికి దగ్గర చేస్తుంటారని తెలియజేశారు. డ్రగ్స్ వాడటం వల్ల మన మెదడు మన ఆధీనంలో ఉండదని సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయని చదువు మీద ఆసక్తి ఉండదని మత్తుపదార్థాలు ఇంకా ఇంకా కావాలని దానివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడి డబ్బులు కోసం మనకు తెలుసో తెలియకో నేరాలకు పాల్పడుతుంటామని వాటి వల్ల జీవితం సర్వనాశనం చేసుకుంటూ జైలు పాలు అవ్వాల్సి వస్తుందని తెలియజేశారు. గంజాయి కేసుల్లో కఠిన శిక్షలు ఉంటాయని కూడా తెలియజేశారు. ఈ మధ్యకాలంలో సమాజంలో గంజాయిని చాక్లెట్ల రూపంలో కూడా తయారు చేసి వాటిని అమ్ముతున్నారని అటువంటివి ఏమైనా మీ దృష్టిలో ఉంటే మాకు సమాచారం అందించాలని ఎవరైనా సైబర్ నేరాలకు గురి అయితే 1930 కి కాల్ చేయాలని మత్తు పదార్థాలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే 1972 కి సమాచారం అందించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ డివిజినల పోలీస్ ఆఫీసర్ అంకిత సురాన , సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , పాచిపెంట ఎస్ ఐ వెంకట సురేష్, జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్దులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
