

గూడూరు మన న్యూస్ :- సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చిల్లకూరు మండలం చింతవరం పంచాయతీ నందు ప్రారంభించిన శాసన సభ్యులు, డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. సునీల్ కుమార్ కి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలను ఆరా తీశారు
అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకంను కూటమి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 12 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ భవనం ను ప్రారంభించారు. 5 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన CC రోడ్ ను ప్రారంభించారు.
అనంతరం కొత్త పాలెం ST కాలనీ నందు ఇంటింటికి తిరుగుతూ సూపరిపాలన కరపత్రం అందిస్తూ ప్రభుత్వ పాలన పై వారి అభిప్రాయాలు తీసుకుని, వారి సమస్యలను తెలుసుకుని త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో పంచాయతీ లో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మరే ప్రభుత్వం చేయలేదు అన్నారు.
