గూడూరు,మన న్యూస్ :- సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామం నందు ప్రారంభించిన…. శాసన సభ్యులు, డాక్టర్ పాశిం సునీల్ కుమార్ – గూడూరు నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. సునీల్ కుమార్ కి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలను ఆరా తీశారు . అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకంను కూటమి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గతంలో గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మరే ప్రభుత్వం చేయలేదు అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , విద్యా మంత్రి నారా లోకేష్ బాబు ల సారధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *