గూడూరు, మన న్యూస్ :- గ్రామంలో ఏమైనా అభివ్రుద్ది జరిగిందంటే..చంద్రబాబు హయాంలో జరిగిన అభివ్రుద్ది తప్ప మరే ప్రభుత్వం చేయలేదని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పేర్కొన్నారు.చిల్లకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పాల్గొని ప్రారంబించారు.ఈ సందర్భంగా ఆయనకు స్దానిక నాయకులు తదితరులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ఎస్సీ,ఎస్టీ,బీసీ కాలనీల్లో దువ్వూరు వినయ్ కుమార్ రెడ్డి అద్వర్యంలో ఆయన పర్యటించారు. పది లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు.కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివ్రుద్ది, సంక్షేమ పధకాలను ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరించారు.ఎన్టీఆర్ భరోసా పించన్, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు,తల్లికి వందనం పధకాల అమలుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ..గ్రామంలో జరిగిన అభివ్రుద్ది టిడిపి హయాంలోనే జరిగిందని తెలిపారు.అన్నదాన సుఖీభవ, వచ్చే నెల 15వ తేదీ నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతుందని పేర్కొన్నారు.సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారద్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఎపి కొత్త చరిత్ర స్రుష్టిస్తోందని ఆయన వివరించారు.ఇంకా మరికొందరు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల అద్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి,చెరుకూరు పద్మజ,గుండాల లీలావతి, శివ కుమార్,నెలటూరు చిరంజీవి,గ్రామ పార్టీ అద్యక్షుడు దువ్వూరు రామచంద్రా రెడ్డి, సాగునీటి సంఘం అద్యక్షురాలు చెరుకూరు ఆదెమ్మ,చాకిరి నరసింహులు,డి. వెంకటేశ్వర్లు,పూనమల్లి రవి కుమార్,దేశయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *