

గూడూరు, మన న్యూస్ :- పెళ్లకూరు మండలంలోని చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు వెంకటాచలం నందుగల దివ్యాంగుల పునరావాస క్షేత్రం వారి సౌజన్యంతో ఈరోజు ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ కార్యకర్తలకు సమావేశం నిర్వహించి వారికి దివ్యాంగుల లో
ముందుగా వైకల్యాలను గుర్తించడం మీద అవగాహన సదస్సు నిర్వహించి మరియు వారి అంగవైకల్యములకు సంబంధించి తీసుకోవలసిన సూచనలు సలహాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాకేష్,ఎదుగుదల నైపుణ్యులు, దామోదర్ , ప్రత్యేక ఉపాధ్యాయులు మరియు వారి సహచర బృందం ఆశ వర్కర్లకు మరియు అంగన్వాడీలకు అనేక సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది .
ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కిట్లను అందజేయడం జరిగింది. పెళ్లకూరు మండలంలో ఉన్నటువంటి దివ్యాంగులను గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికి వారి అవసరానికి తగ్గ వస్తువులను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో పెళ్లకూరు పి హెచ్ సి డాక్టర్ జితేంద్ర
చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ సీఈఓ సీతారామనాయుడు ఏవో కృష్ణా గల్లా
తదితరులు పాల్గొన్నారు.

