

మన న్యూస్ పాచిపెంట,జూలై1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని గిరిజన శాఖ మంత్రి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం నాడు పాచిపెంట మండలం పెద్దవలస పంచాయతీ పరిధిలో గల తెట్టెడువలస గిరిజన గ్రామంలో ఎన్ టి ఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. పేదల సేవలో భాగంగా ఎన్ టి ఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. గ్రామంలో స్వయంగా ఇంటింటికీ వెళ్లి బడుగు, బలహీన వర్గాలకు చెందిన వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు మంత్రి పింఛన్లు అందించారు. పింఛను పంపిణీ కేవలం సంక్షేమం మాత్రమే కాదు, ఇది ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న బాధ్యతను వ్యక్తం చేస్తుందన్నారు. చంద్రన్న ఆశయాలను నిలబెట్టుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెను గెలుచుకునేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు అమలు చేసి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పాంచాలి సర్పంచ్, మండల తెలుగుదేశం నాయకులు జి యుగంధర్, సీనియర్ నాయకులు కనకరావు, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.