గంగాధర నెల్లూరు ,మన న్యూస్, జూన్ 28: గంగాధర నెల్లూరు శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి నాయకులు ఐక్యంత చాటారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురసాల కిషన్ చంద్ మాట్లాడుతూ, “థామస్ ఒక ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా, సామాజిక సేవలోనూ ముందు వరుసలో నిలుస్తున్నారు. ఆయనే మా ప్రేరణ” అని పేర్కొన్నారు. వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షులు బట్టే చాణిక్య ప్రతాప్ మాట్లాడుతూ, “వికాసం, ప్రజాసేవతో కూడిన పాలనకు థామస్ నిలువెత్తు ఉదాహరణ. ఆయన్నిలా ఒక ప్రజానేతగా మాతో ఉండడం గర్వంగా ఉంది” అని అన్నారు. ఇనాం కొత్తూరు టిడిపి సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, యువ నాయకులు మురళి రెడ్డి, జక్కదోనా బూత్ కన్వీనర్ లోకేష్ యాదవ్ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “థామస్ అభివృద్ధి దృక్పథం యువతలో ఆశాభావం నింపుతుంది” అని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పాముల శేషాద్రి కూడా థామస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. “పార్టీలకతీతంగా థామస్ సేవలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో గల రాజకీయ పార్టీలు మరియు యువత నేతల మధ్య సానుకూల వాతావరణం ప్రతిఫలించింది. ఐక్యతతో ఎదుగుదల సాధ్యమన్న సంకేతాన్ని ఈ శుభాకాంక్షలు సంకేతంగా నిలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *