మన న్యూస్ మక్తల్ ఉ మ్మడి పాలమూరు జిల్లాలో జాగృతిని బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ కవితమ్మ అన్నారు బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ గారిపై తప్పుడు ఆరోపణలు చేస్తే తెలంగాణలో ఎక్కడ కూడా సహించేది లేదని ఆమె అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి పేద రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన ఘనత కేసిఆర్దని ఆమె అన్నారు అయితే బనకచర్ల ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియని మూర్ఖుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో ఉంటుంది కానీ ఆయన మాత్రం గుంటూరు జిల్లాలో ఉంటుందనీ మాట్లాడుతున్నాడు, బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడంటే సిగ్గుపడాల్సిన అంశమని వారు అన్నారు. తెలంగాణ ప్రజల కోసం జాగృతి అన్ని జిల్లాల్లో విస్తరించి తెలంగాణ ప్రజల కోసం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆర్ గ్యారంటీ అమలు చేసే వరకు పోరాడుతూనే ఉంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు రుద్రసముద్రం రామలింగం మక్తల్ నియోజకవర్గం పొన్నయ్య తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *