

పాలసముద్రం మండలం, మన న్యూస్ : శ్రీ కావేరి రాజపురం పంచాయతీ గ్రామ సర్పంచ్ గాలి మహేష్ బాబుకు సామాజిక సేవా కార్యక్రమంలో విశేష కృషి చేసినందుకు డాక్టరేట్ అవార్డు, గ్రామ పంచాయితీ అభివృద్ధిలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు విశేష కృషి చేసి గ్రామాలను మెరుగుపరిచిన పనులను గుర్తించి గ్లోబల్ అచ్చువర్స్ కౌన్సిల్ సహకారంతో సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ రెండు ప్రధాన అవార్డులను అందించారు. ఈ సందర్భంగా శ్రీకాళరాజపురం గ్రామ సర్పంచ్ గాలి మహేష్ బాబు మాట్లాడుతూ తాము చేసిన సేవలను అభివృద్ధిని చూసి గుర్తించి డాక్టరేట్ అవార్డు, ఉత్తమ సర్పంచ్ అవార్డు అందించినందుకు, వాటికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు పంచాయతీ ప్రజలు, మండల వాసులు అతన్ని అభినందించారు.