రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో నిర్వహణ
రేణిగుంట: డా. బషీర్‌స్ తపస్య స్కూల్, రేణిగుంటలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో “తపస్య యంగ్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ – 2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ టి ఐ హెచ్ పాఠశాలను సందర్శించి విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులను పరిశీలించారు.
విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలు, ప్రాజెక్టుల పనితీరును అతిథులకు వివరించారు. ప్రాజెక్టుల పరిశీలన అనంతరం ప్రతిభ కనబరిచిన టాప్ 3 వినూత్న బృందాలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. భవిష్యత్తులో మరింత పరిశోధన, అభివృద్ధికి అవకాశం ఉన్న కొన్ని ప్రాజెక్టులను ఇన్నోవేషన్ హబ్‌లో తదుపరి పరిశీలనకు సిఫారసు చేశారు.
ఈ కార్యక్రమానికి ఆర్ టి ఐ హెచ్ హెడ్ ఆఫ్ ఇంక్యుబేషన్ డా. డి. ప్రగతి, ప్రోగ్రామ్ అసోసియేటర్స్ పి. రెనిష్‌కుమార్, పి. కిరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు విద్యార్థులతో మమేకమై, వారి సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, వినూత్న ఆలోచనా విధానం, సమస్య పరిష్కార నైపుణ్యాలను అభినందించారు.
విద్యార్థుల్లో ప్రాక్టికల్ లెర్నింగ్, పరిశోధనాత్మక దృక్పథం, సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ విద్యా ప్రగతితో పాటు సమగ్ర విద్యార్థి అభివృద్ధికి తపస్య స్కూల్ చేస్తున్న కృషిని అతిథులు ప్రశంసించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షేక్ విక్రమ్ షాలి, డైరెక్టర్ కె. అనుషా గౌరవ అతిథులను ఘనంగా సత్కరించి, టాప్ 3 విజేత బృందాలకు బహుమతులను అందజేశారు. విద్యార్థుల వినూత్న ఆలోచనలు, ప్రతిభను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని పరిశోధనాత్మక కార్యక్రమాలను నిర్వహించేందుకు పాఠశాల ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.
