బద్వేల్, జూన్ 21: మన న్యూస్: బద్వేల్ డివిజన్ పరిధిలో G.O.Ms.No.30, ప్రకారం పంపిణీ అయిన ఇంటి పట్టాలకు సంబంధించి 180 దరఖాస్తులపై అధికారులు సమీక్ష నిర్వహించారు. వీటిలో 58 దరఖాస్తులను అర్హులుగా గుర్తించగా, మిగిలిన 122 దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తిరస్కరించబడ్డాయని శనివారం ఆర్డీవో చంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రెవెన్యూతో పాటు మున్సిపల్, పోలీస్, మరియు గృహ నిర్మాణ శాఖల అధికారులు పాల్గొన్నారు. సంబంధిత మండల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రాజెక్ట్ అధికారులు తిరస్కరించిన దరఖాస్తుల ప్రధాన కారణాలు, తెలియజేస్తూ
గతంలో గృహ పథకంలో లబ్ధిదారులుగా ఉండటం,
ఇల్లు రహదారి మీద ఉండటం, నీటి నిల్వ ప్రదేశాలపై నిర్మాణాలు చేయడం, ఇంటి పట్టా నిబంధనల ఉల్లంఘన చేయడం ఇలాంటి వారిని అనర్హులుగా గుర్తించడం జరిగింది. అలాగే
అర్హులుగా గుర్తించిన 58 మంది దరఖాస్తుదారులకు త్వరలోనే QR కోడ్ ఆధారిత ప్రామాణిక పత్రాలను అందజేస్తామని అధికారులు తెలిపారు.
అర్హత పొందని దరఖాస్తుదారులు అభ్యంతరాలను అధికారులను సంప్రదించి వివరాలు పొందవచ్చని సూచించారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *