రౌడీషీటర్లు, పునరావృత నేరస్థులకు పోలీసుల గట్టి హెచ్చరిక. చట్టాన్ని ధిక్కరించే వారికి ఎలాంటి ఉపేక్ష
ఉండదని స్పష్టం.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు.
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి…
ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు కొనసాగింపు.
తిరుపతి సెప్టెంబర్ 26 :
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు తిరుపతి జిల్లా పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో నేర నియంత్రణ, రౌడీషీటర్లపై నిఘా, సంఘవిద్రోహ కార్యకలాపాల అరికట్టడంపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించిన ఒక రౌడీషీటర్పై కఠిన చర్యలు తీసుకుంటూ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడం జరిగింది. నేరాలకు పాల్పడేవారికి ఇది స్పష్టమైన హెచ్చరికగా నిలుస్తుందని పోలీసులు తెలిపారు.ఈ నేపథ్యంలో రెడ్డిపల్లి ఇబ్రహీం కలీల్ మరియు షేక్ ఇమామ్, వయస్సు 29 ఎర్స సన్నాఫ్ లేట్ అబ్దుల్లా డోర్ నెంబర్ 3-20 గురవరాజుపల్లి గ్రామం, రేణిగుంట మండలం, తిరుపతి జిల్లా నివాసి. ఇప్పుడు డోర్ నెంబర్ 3-100, బుగ్గ వీధి, రేణిగుంట టౌన్లో ఉంటున్న ఇతను . గత 06 సంవత్సరాలుగా మద్యానికి బానిసై, తరచూ గొడవలకు పాల్పడటం, అలాగే మద్యం మత్తులో ఎదురుపడిన గుర్తుతెలియని వ్యక్తులను బెదిరించడం మరియు కొట్టడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వలన ఇతని పై రేణిగుంట పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు, గాజుల మాండ్యం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు చెప్పున మొత్తం నాల్గు కేసులు ఉన్నందున అతని పై రౌడీషీట్ తెరవబడింది. నేరప్రవృత్తికి దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించే అవకాశం కల్పించే ఉద్దేశంతో రేణిగుంట డీస్పీ సూచనలతో రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్. జయచంద్ర సెప్టెంబర్ 20 వ తేదీన సదరు వ్యక్తిని రేణిగుంట మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట బైండ్ ఓవర్ చేయించారు.అయితే, బైండ్ ఓవర్లో ఉన్నప్పటికీ సెప్టెంబర్ 15 వ తేదీన అర్ద రాత్రి బుగ్గ వీది లో మద్యం త్రాగి అక్కడ వినాయక విగ్రహం వద్ద పాటలు పెట్టమని వారి తో గొడవ పడినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో అతని పై కేసు నమోదు చేయడం అయినది. అంతట బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ దినం అనగా సెప్టెంబర్ 20 న రేణిగుంట మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ శ్రావణ్ కుమార్ ఎదుట హాజరుపరచారు. విచారణ అనంతరం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా పోలీసులు స్పష్టం చేస్తూ రౌడీషీటర్లు, పునరావృత నేరస్థులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు మరియు సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టం ప్రకారం మరింత కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. బైండ్ ఓవర్ వంటి నిరోధక చర్యలను ఉల్లంఘించే వారికి ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు.ప్రజలు ప్రశాంతంగా జీవించే వాతావరణాన్ని కల్పించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని, నేరాలకు పాల్పడే వారిని చట్టం ముందు నిలబెట్టడంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో నేరరహిత, భయరహిత సమాజ నిర్మాణమే తిరుపతి జిల్లా పోలీసుల లక్ష్యమని తెలిపారు.
