మన న్యూస్, నారాయణ పేట జిల్లా: మక్తల్ మున్సిపాలిటీ లో క్రీడా మైదానంలో గల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు విద్యార్థుల సౌకర్యం కోసం త్రాగు మంచినీటి కొరకు దాతలు మన్సాని రాగమ్మ నారాయణ గార్ల జ్ఞాపకార్థంగా మన్సాని రుక్మిణి అంపయ్య గార్లు మరియు వారి కుటుంబ సభ్యులచే మినీ ట్యాంక్ బహుకరించారు. కట్టా సురేష్ కుమార్ గారిచే పూజ కార్యక్రమాన్ని నిర్వహించి, కట్ట సురేష్ తో పాటు మనసాని రాగమ్మ నారాయణ మనుమడు మనసాని నాగరాజు మినీ ట్యాంక్ ను ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ,మా కళాశాల విద్యార్థులకు సౌకర్యంగా ఉండే మినీ ట్యాంకును బహుకరించినందుకు దాతలకు కృతజ్ఞతలు తెలిపి, దాతల మనుమడు మనసాని నాగరాజు, ప్రారంభకులు కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ తో పాటు వచ్చిన వారికీ సన్మానం చేశారు, ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్, బిలకంటి శ్రీనివాస్,కల్వాల కిషోర్,మనసాని కిరణ్,రంజిత్,మహేష్, తిమ్మన్న,లెక్చరర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *