న్యూస్ ఎల్ బి నగర్ :- శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం కమిటీకి, బి.ఎన్.రెడ్డి నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీకి, పద్మావతి కాలని శ్రీ షిరిడీ సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ కమిటీ, ప్రశాంతి నగర్ కు క్యాన్సర్ కారక ప్లాస్టిక్ ప్లేట్లకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యం/పర్యావరణహితమైన స్టీల్ ప్లేట్లు, స్టీల్ వాటర్ గ్లాసులు, జ్యూట్ బ్యాగ్ లు, మొక్కలు ఉచిత పంపిణీ… జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ భావన శ్రీనివాస్ సభాద్యక్షతన తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ కార్యాలయం ఇఇ వెంకట నర్సు ప్రత్యేక చొరవతో, ఆదాని గ్రూప్ వారి ఆర్ధిక సహకారంతో ఒక్కో దేవాలయానికి భక్తుల ఆరోగ్యం, పుడమితల్లి పరిరక్షణ నిమిత్తం 98 స్టీల్ ప్లేట్లు 98 స్టీల్ క్లాసులు 45 జూట్ బ్యాగులు చొప్పున ఉచితంగా అందచేయడం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హయత్నగర్ సర్కిల్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉప కమిషనర్ శ్రీ అజ్మీర స్వామి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో దేవాలయాలు భక్తులకు మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా ఉండాలని అన్నారు. నేల కాలుష్యం, పరిసరాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం నిషేధించిందని, ప్రజా శ్రేయస్సు కొరకు ప్రభుత్వం చేసే చట్టాలను గౌరవించి ప్రజలు సహకరించాలని అన్నారు. ప్రజారోగ్యానికి హానిచేసే కాలుష్య కారక ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా తిరిగి వాడుకునే వస్తువులను వాడాలని ప్రోత్సహిస్తూ ఉచితంగా వాటిని ఇస్తూ ఆచరణాత్మకంగా ముందడుగు వేసి సమాజానికి స్పూర్తిగా నిలుస్తున్న జాగృతి అభ్యుదయ సంఘం ప్రయత్నాలను అభినందించారు.పాడైపోయిన దేవీదేవతల పటాలను భక్తులు ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్తగా తొలగించేందుకు “ఉద్వాసన”
నూతన కార్యక్రమం MMC రూపొందించి ఏజెన్సీ ద్వారా వివిధ దేవాలయాల్లో అందుబాటులోకి తెచ్చామని, ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలన్నారు. పర్యావరణాన్ని కాపాడి మానవాళికి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలని రాబోయే క్యాన్సర్ లాంటి విపత్కరమైనటువంటి రుగ్మతల నుంచి సమాజాన్ని కాపాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఒక్కో దేవాలయానికి షుమారు 20వేల రూ.ల విలువైన వస్తువులు ఇచ్చిన జాగృతి స్వచ్ఛంద సంస్థ ఉద్దేశ్యాలను తమ దేవాలయంలో అమలు పరుస్తూ ముందుకు తీసికెళ్ళి భక్తుల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంచుతామని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థాన కమిటీ, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటి, శ్రీ షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయా దేవాలయాల ప్రతినిధులు మాట్లాడుతూ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా, సమాజానికి సేవ చేసే కేంద్రాలుగా కూడా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, మొక్కల పెంపకం, వాటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమాల్లో… దేవాలయాల ప్రతినిధులు బూడిది వివేకానంద రెడ్డి, సి. మంగపతి రావు, ఎం. రాజి రెడ్డి, చంద్రశేఖర్, కుమారస్వామి, నారాయణ, రామకృష్ణ, రవీందర్, రమేష్, సాంబశివరావు, జాగృతి ప్రతినిధులు శ్రీరంగనాధ్, యాదా రామలింగేశ్వర్రావు, ఇ.శ్రీరాములు గౌడ్, ఎ.సత్యనారాయణ, రఘునాధ్ యాదవ్, గాయకులు కె.వి.రమణయ్య, తాతయ్య, అల్లూరయ్య శెట్టి, ఓబులేష్ యాదవ్, భ్రమరాంబ, రఘురాములు, నాగమణి, రవీందర్, పూజారులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు. భావన శ్రీనివాస్ ఛైర్మన్ – జాగృతి అభ్యుదయ సంఘం
